Stock Market Closing 06 December 2022:


భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ఐటీ, మెటల్‌ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉండటంతో ఉదయం సూచీలు ఎక్కువ పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 58 పాయింట్ల నష్టంతో 18,642 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 208 పాయింట్ల నష్టంతో 62,626 వద్ద ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మరోసారి అండగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82 పైసలు బలపడి 82.61 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 63,834 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,395 వద్ద మొదలైంది. 62,390 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,677 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 208 పాయింట్ల నస్టంతో 62,626 వద్ద క్లోజైంది.


NSE Nifty


సోమవారం 18,701 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,607 వద్ద ఓపెనైంది. 18,577 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,654 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 58 పాయింట్ల నష్టంతో 18,642 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,093 వద్ద మొదలైంది. 43,076 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,306 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 194 పాయింట్లు పతనమై 43,138 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యూపీఎల్‌ నష్టపోయాయి.  


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.