Stock Market Closing 04 November 2022: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగిచిన సూచీలు ఆఖర్లో ర్యాలీ చేశాయి.  అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 64 పాయింట్ల లాభంతో 18,117 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 113 పాయింట్ల లాభంతో 60,950 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 45 పైసలు లాభపడి 82.43 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 60,836 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,698 వద్ద మొదలైంది. 60,666 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,004 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 113 పాయింట్ల లాభంతో 60,950 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 18,052 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,053 వద్ద ఓపెనైంది. 18,017 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,135 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 64 పాయింట్ల లాభంతో 18,117 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 41,314 వద్ద మొదలైంది. 41,051 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,516 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 39 పాయింట్ల నష్టంతో 41,258 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌షేర్లు లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, హిందుస్థాన్‌ యునీలివర్‌, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.