Stock Market at 12PM, 01 September 2023: 


స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మంచి సిగ్నల్సే అందాయి. అదానీ గ్రూప్‌పై జార్జి సొరోస్‌ ఫండింగ్‌ చేసిన కంపెనీ నివేదికల ప్రభావం తగ్గింది. మెరుగైన జీడీపీ గణాంకాలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్లు పెరిగి 19,340 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 238 పాయింట్లు పెరిగి 65,069 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 64,831 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 64,855 వద్ద మొదలైంది. 64,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,082 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 238 పాయింట్ల లాభంతో 65,069 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 19,253 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,258 వద్ద ఓపెనైంది. 19,255 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,350 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 86 పాయింట్లు పెరిగి 19,340 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 43,996 వద్ద మొదలైంది. 43,830 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 68 పాయింట్ల లాభంతో 44,057 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. జియోఫిన్‌, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్‌, ఎస్బీఐ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. దివిస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, బ్రిటానియా షేర్లు తగ్గాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్ గ్యాస్‌ సూచీలు ఎక్కువ పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.60,050 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 తగ్గి రూ.25,790 వద్ద ఉంది.


Also Read: జూన్‌ క్వార్టర్‌లో ఫుల్‌ స్పీడ్‌తో దూసుకెళ్లిన జీడీపీ ఇంజిన్‌ - ఇంధనంలా పని చేసిన వ్యవసాయం, ఆర్థికం


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.