Stock Market @12 PM, 25 May 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. బ్యాంకింగ్ షేర్లు వరుసగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 65 పాయింట్లు తగ్గి 18,220 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 192 పాయింట్లు తగ్గి 61,581 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,773 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,706 వద్ద మొదలైంది. 61,534 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 192 పాయింట్ల నష్టంతో 61,581 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవవారం 18,285 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,268 వద్ద ఓపెనైంది. 18,213 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,303 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 65 పాయింట్లు తగ్గి 18,220 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,630 వద్ద మొదలైంది. 43,453 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,705 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 212 పాయింట్లు తగ్గి 43,465 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, ఐటీసీ, దివిస్ ల్యాబ్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.60,870గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.73,050 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.740 తగ్గి రూ.27,220 వద్ద కొనసాగుతోంది.
Also Read: 5 సింపుల్ టిప్స్ పాటిస్తే ఎక్కువ హోమ్ లోన్ మీ సొంతం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.