By: ABP Desam | Updated at : 06 May 2023 05:39 AM (IST)
మ్యూచువల్ ఫండ్లలో తగ్గిన టిక్కెట్ సైజ్
Mutual Fund Investments: 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్టర్లు అపారమైన నమ్మకం పెట్టారు. దీంతో, ఆ ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు, ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడులు (SIPలు) రికార్డ్ స్థాయిలో పెరిగాయి, చిన్న పెట్టుబడిదార్లలో (retail investors) విపరీతమైన ఉత్సాహం కనిపించింది.
తగ్గిన సగటు పెట్టుబడి మొత్తం
అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్ల సగటు పెట్టుబడి మొత్తం తగ్గింది. 2022 మార్చి చివరి నాటికి రిటైల్ పెట్టుబడిదార్ల సగటు పెట్టుబడి విలువ రూ. 70,199 గా ఉంది. 2023 మార్చి చివరి నాటికి అది రూ. 68,321 కి తగ్గింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi) ఈ డేటాను విడుదల చేసింది.
విచిత్రం ఏంటంటే... 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మ్యూచువల్ ఫండ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల సగటు పెట్టుబడి మొత్తం క్షీణించగా, సంస్థాగత పెట్టుబడిదార్ల (institutional investors) సగటు పెట్టుబడి మొత్తం పెరిగింది. ఈ కాలంలో, సంస్థాగత పెట్టుబడిదార్ల సగటు పెట్టుబడి రూ. 10.11 కోట్లుగా ఉంది. లిక్విడ్ & డెట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో సంస్థాగత పెట్టుబడిదార్ల పెట్టుబడి అత్యధికంగా ఉంది. డెట్ పథకాల్లో సగటు పెట్టుబడి రూ. 14.53 లక్షలు కాగా, ఈక్విటీ ఫండ్లలో సగటు పెట్టుబడి రూ. 1.54 లక్షలుగా ఉంది.
ఈక్విటీయేతర ఆస్తులతో పోలిస్తే, ఈక్విటీల్లో సంస్థాగత పెట్టుబడిదార్ల పెట్టుబడులు ఎక్కువ కాలం పాటు కొనసాగాయి. 45 శాతం ఈక్విటీ ఆస్తుల్లో పెట్టుబడి హోల్డింగ్ వ్యవధి 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో, రిటైల్ ఇన్వెస్టర్లు 56.5 శాతం ఈక్విటీ ఆస్తుల్లో రెండేళ్లకు పైగా పెట్టుబడులు హోల్డ్ చేశారు. ఆ సమయంలో, రిటైల్ ఇన్వెస్టర్ల ఖాతాలలో విపరీతమైన వృద్ధి కనిపించింది. క్రెడిట్ డిజిటలైజేషన్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడంలో అవగాహన పెరగడం వల్ల ఈ పెరుగుదల సాధ్యమైంది.
FY23లో 1.62 కోట్ల కొత్త ఖాతాలు
2022-23లో, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి 1.62 కోట్ల కొత్త ఫోలియోలు యాడ్ అయ్యాయి. 2014 డిసెంబర్‌లోని 4.03 కోట్ల ఖాతాలతో పోలిస్తే ప్రస్తుతం అనేక రెట్ల జంప్ కనిపించింది. ఫోలియోల సంఖ్య 2022 మార్చి చివరి నాటికి 12.95 కోట్లకు, 2023 మార్చి చివరి నాటికి 14.57 కోట్లకు పెరిగాయి. ఈ 14.57 కోట్ల ఫోలియోల్లో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 91 శాతం లేదా 13.28 కోట్లు. ఇందులో అధిక నికర విలువ కలిగిన వ్యక్తిగత ఇన్వెస్టర్ల (HNIలు) ఖాతాల సంఖ్య 1.19 కోట్లకు చేరగా, సంస్థాగత ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 9.82 లక్షలకు చేరుకుంది. 2022-23లో మ్యూచువల్ ఫండ్లలో ఇన్‌ఫ్లోస్ 7 శాతం పెరిగి రూ. 40.05 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో చిన్న పెట్టుబడిదార్ల వాటా 17 శాతం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే