By: ABP Desam | Updated at : 05 Sep 2022 12:27 PM (IST)
Edited By: Arunmali
వృద్ధి మార్గంలో మణప్పురం ఫైనాన్స్
Manappuram Finance: ఏకీకృత నిర్వహణలోని ఆస్తుల్లో (AUM) వృద్ధి, గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో విస్తరణ వల్ల; 2022-23 మొదటి త్రైమాసికంలో (Q1FY23) మణప్పురం ఫైనాన్స్ (Manappuram Finance) మంచి నంబర్లను (QoQ) నివేదించింది. అయితే, మైక్రోఫైనాన్స్ (MFI) బిజినెస్‌లో పెరిగిన కేటాయింపుల (ప్రొవిజన్స్) వల్ల YoY పనితీరు తగ్గింది. Q1లో నివేదించిన రూ.282.1 కోట్ల లాభం QoQ ప్రాతిపదికన 8.1% పెరిగినా, YoY ప్రాతిపదికన 35.4% పడిపోయింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, నిపుణులు ఈ కంపెనీ మీద సానుకూలంగా ఉన్నారు. 13 మంది సర్టిఫైడ్ ఎనలిస్ట్‌లు ఈ స్టాక్‌కు 'బయ్' రేటింగ్ ఇవ్వగా, ఇద్దరు 'హోల్డ్' చేయమన్నారు. ఒక్కరు మాత్రం 'సెల్' కాల్ ఇచ్చారు.
మణప్పురం ఫైనాన్స్‌కు 28 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,000 శాఖలు ఉన్నాయి. బలమైన బ్రాండింగ్‌తో, ఆదాయాన్ని పెంచుకోగల సత్తా ఉన్న కంపెనీగా విశ్లేషకులు దీనిని లెక్కేశారు. దీనికి 5 వృద్ధి కారకాలను చెబుతున్నారు.
వృద్ధి కారకం నంబర్ 1: కంపెనీ యొక్క ప్రధాన వ్యాపారమైన గోల్డ్ లోన్లది మొత్తం AUMలో 67% వాటా. ఆర్థిక వ్యవస్థ పికప్ కారణంగా, లోన్ల కోసం ఈ కంపెనీ కాలింగ్ బెల్ కొట్టేవాళ్ల సంఖ్యతోపాటు, దీని ఆదాయం పెరగవచ్చు. 2022-23 మొదటి త్రైమాసికంలో, ఈ సెగ్మెంట్‌లోని కస్టమర్ బేస్ 4.2% YoY, మరియు 4.6% QoQ వృద్ధితో 25 లక్షలకు పెరిగింది. 2022-23లో, గోల్డ్ లోన్ విభాగంలో 10% వృద్ధిని, ఇతర విభాగాల్లో 20% పైగా వృద్ధిని సాధించాలని మేనేజ్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
వృద్ధి కారకం నంబర్ 2: MFIల కోసం 10% స్ప్రెడ్ క్యాప్‌ను ఇటీవల RBI తొలగించింది. మణప్పురం మైక్రోఫైనాన్స్ అనుబంధ సంస్థ అయిన ఆశిర్వాద్ (Asirvad), దీనివల్ల లాభం పొందుతుంది. రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్, మైక్రోఫైనాన్స్ పరిశ్రమకు 2021-22లో తానిచ్చిన 'నెగెటివ్' రేటింగ్‌ను 2022-23కి 'న్యూట్రల్'కి అప్‌గ్రేడ్ చేసింది.
వృద్ధి కారకం నంబర్ 3: వాహన విక్రయాల్లో జంప్ నుంచి, మణప్పురం వాహన ఫైనాన్స్ విభాగం ప్రయోజనం పొందుతుంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, 2022-23లో సేల్స్ సైజ్ 5-9% పెరుగుతుందని అంచనా. 2022-23 మొదటి త్రైమాసికంలో ఈ సెగ్మెంట్ AUM 6.8% QoQ, 68% YoY పెరిగింది.
వృద్ధి కారకం నంబర్ 4: స్థిరంగా ఉన్న ప్రాపర్టీ రేట్లు, పెరుగుతున్న జీతాలు, పెరిగిన రుణ స్థోమత కారణంగా గృహ రుణ వ్యాపారం లాభపడుతుందని ఎక్స్‌పర్ట్‌లు భావిస్తున్నారు. ఇండియా రేటింగ్స్ ప్రకారం, హౌసింగ్ ఫైనాన్స్ వ్యాపారం 2021-22లోని 11%తో పోలిస్తే 2022-23లో 13%కి పెరుగుతుందని అంచనా. 2022-23 మొదటి త్రైమాసికంలో గృహ రుణ వ్యాపారంలో ఈ కంపెనీ 3.5% QoQ, 30.9% YoY వృద్ధిని సాధించింది.
వృద్ధి కారకం నంబర్ 5: కంపెనీ బలమైన అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్ పొజిషన్‌ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తోంది. కాస్ట్ ఆఫ్ ఫండ్స్, 2021-22 మొదటి త్రైమాసికంలో 9%గా ఉంటే, ఈ సంవత్సరం ఇదే కాలంలో 8.1%కి మెరుగుపడింది. అంటే, అప్పులు ఇవ్వడం మీద అవుతున్న ఖర్చులు తగ్గాయి.
ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి 2.13% లేదా రూ.2.20 పెరిగిన షేరు ధర, రూ.105.25 దగ్గర ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో రూ.2.90 లేదా 2.68%; గత ఆరు నెలల్లో రూ.9.20 లేదా 8.04% ఈ స్టాక్ నష్టపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
Game Changer: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్