By: ABP Desam | Updated at : 13 Jul 2023 02:54 PM (IST)
స్మాల్ ఇన్వెస్టర్లకు ఇష్టమైన 'హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్'
Hybrid Mutual Fund: ఏ వ్యక్తయినా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రిస్క్ తీసుకోవాలనుకునే వాళ్లకు మాత్రమే స్టాక్ మార్కెట్ సూట్ అవుతుంది. మార్కెట్ గురించి పెద్దగా అవగాహన/అనుభవం లేని పెట్టుబడిదార్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఛాయిస్. ఈ ఫండ్స్‌ను ఎక్స్‌పర్ట్స్ టీమ్ నిర్వహిస్తుంది. కాబట్టి, ఒక మామూలు ఇన్వెస్టర్ మార్కెట్‌పై ఓ కన్నేసి ఉంచలేకపోయినా, అతని బదులు ఎక్స్‌పర్ట్స్ టీమ్ పని చేస్తుంది.
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌తో ఏంటి లాభం?
మార్కెట్ బూమ్‌ను ఉపయోగించుకుంటూనే, 'లోయర్ రిస్క్' మెయిన్‌టైన్ చేయాలంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగపడతాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే... విభిన్న అసెట్ క్లాసెస్ మిశ్రమం. సాధారణంగా, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇండియన్ ఈక్విటీస్, డెట్ రెండూ ఉంటాయి. మరికొన్ని హైబ్రిడ్ ఫండ్స్ ఇండియన్ ఈక్విటీస్, డెట్‌తో పాటు బంగారం, ఇంటర్నేషనల్ ఈక్విటీస్‌ను కూడా పోర్ట్‌ఫోలియో పెట్టుకుంటాయి. అంటే, ఈ ఫండ్స్‌లో డబ్బులు పెడితే ఈక్విటీస్, డెట్, బంగారం ఇలా అన్ని మార్గాల్లో పెట్టుబడి పెట్టినట్లే.
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ ఎవరి కోసం?
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌లో మీరు పెట్టే పెట్టుబడి ఒకటే అయినా, విభిన్న అసెట్ క్లాస్‌ల ప్రయోజనాన్ని అది అందిస్తుంది. వెయ్యి రూపాయలు, రెండు వేల రూపాయలు వంటి చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ, 3-5 సంవత్సరాల స్వల్పకాలిక లక్ష్యాలు కలిగి ఉన్న పెట్టుబడిదార్లకు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఛాయిస్.
హైబ్రిడ్ ఫండ్స్ ప్రధానంగా ఐదు రకాలు:
కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్: ఈ ఫండ్స్ 10-15% ఈక్విటీస్, మిగిలిన 75-90% డెట్‌లో పెట్టుబడి పెడతాయి. వీటిలో రిస్క్ తక్కువే, కానీ రిటర్న్స్ కూడా తక్కువే. దీని సగటు రాబడి గత ఒక సంవత్సరంలో 9.74%, గత మూడేళ్లలో 8.72%, గత 5 సంవత్సరాల్లో 7.16%.
అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్: ఈ ఫండ్స్ కనిష్టంగా 65%, గరిష్టంగా 80% ఈక్విటీలో పెట్టుబడి పెడతాయి. మిగిలిన 20-35% బాండ్స్, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టబడతాయి. ఎక్కువ రిస్క్ తీసుకోగల పెట్టుబడిదార్లకు ఇది పనికొస్తుంది. దీని బెంచ్‌మార్క్ 2022లో 4.8 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ హైబ్రిడ్ ఫండ్స్: ఈ ఫండ్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోను ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. 2020 మార్చిలో కరోనా కారణంగా మార్కెట్ పడిపోయినప్పుడు చాలా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ హైబ్రిడ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియోలను ఈక్విటీస్‌తో నింపేశాయి. ఆ తర్వాత మార్కెట్ పుంజుకున్నప్పుడు ఎక్కువ లాభాలు సంపాదించాయి.
మల్టీ-అసెట్ అలొకేషన్ హైబ్రిడ్ ఫండ్స్: వీటిని ఎవర్ గ్రీన్ ఫండ్స్ అంటారు. 2022లో దీని బెంచ్‌మార్క్ 5.8 శాతం ఇచ్చింది. ఈ కేటగిరీ, గత ఒక సంవత్సరంలో 17.74 శాతం, మూడేళ్లలో 17.93 శాతం, ఐదేళ్లలో 10.22 శాతం లాభాలు ఆర్జించింది.
ఈక్విటీ సేవింగ్ హైబ్రిడ్ ఫండ్స్: ఈ ఫండ్స్ ఈక్విటీలో 65 శాతం వరకు, డెట్‌లో 10 శాతం వరకు పెట్టుబడి పెడతాయి. దీని సగటు రిటర్న్స్ గత ఒక సంవత్సరంలో 11.32 శాతం, మూడేళ్లలో 11.06 శాతం, ఐదేళ్లలో 7.51 శాతం.
మరో ఆసక్తికర కథనం: మ్యాగ్జిమమ్ రిఫండ్ పొందేందుకు 5 స్ట్రాటెజీలు, తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?