Best Mutual Fund Returns: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే మార్గాల్లో మ్యూచువల్ ఫండ్ (MF) ఒకటి. నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం కన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. షేర్లు కొనాలన్న కోరిక ఉన్నా... మార్కెట్‌పై ఫోకస్ పెట్టేంత సమయం లేనివాళ్లకు, కొత్త వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ ఒక ఉత్తమ మార్గం.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్లు చక్కగా రాణించాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పథకాలు పెట్టుబడిదార్లకు మంచి లాభాలను అందించాయి. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చాలా మ్యూచువల్ ఫండ్స్ 40 నుంచి 50 శాతం రాబడి ఇచ్చాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి అధిక రాబడి లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ50 ఇండెక్స్ కూడా దాదాపు 30 శాతం పెరిగింది.
2023-24లో మెరుగైన రిటర్న్ అందించిన మ్యూచువల్ ఫండ్స్
స్మాల్ క్యాప్ ఫండ్స్ (Small cap funds)
స్మాల్ క్యాప్ ఫండ్స్ గత ఏడాది బాగా పెర్ఫార్మ్ చేశాయి. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక సంవత్సరంలో 69 శాతం రాబడిని ఇచ్చింది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 66 శాతం, మహీంద్ర మ్యానులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 65 శాతం, ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 62 శాతం రిటర్న్ ఇచ్చాయి.
మిడ్ క్యాప్ ఫండ్స్ (Mid Cap Funds)
గత ఆర్థిక సంవత్సరంలో, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 65 శాతం పెరిగింది. ఐటీఐ మిడ్ క్యాప్ ఫండ్ 62 శాతం లాభాలను అందించింది. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 60 శాతం రాబడిని ఇచ్చింది. మహీంద్ర మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 59 శాతం తిరిగి ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ 57 శాతం రాబడిని ఇచ్చింది.
లార్జ్ క్యాప్ ఫండ్స్ (Large cap funds)
లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే, తమ పెట్టుబడిలో కనీసం 80 శాతాన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని మిడ్ లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో... క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్ 52 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూ చిప్ 47 శాతం, జేఎమ్ లార్జ్ క్యాప్ 45 శాతం, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 44 శాతం, టారస్ లార్జ్ క్యాప్ ఫండ్ 44 శాతం రాబడులు అందించాయి.
పెట్టుబడిదార్లు ఒక విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. గత సంవత్సరాల్లో వచ్చిన రాబడి భవిష్యత్‌లోనూ కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. గత లాభాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకూడదు, తెలివిగా వ్యవహరించాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.