ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రమోట్‌ చేస్తున్న మెట్రో బ్రాండ్స్‌ ఫుట్‌వేర్‌ కంపెనీ దుమ్మురేపింది. 2021, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.100.85 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయంలో 54.63 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.65.22 కోట్లు కావడం గమనార్హం.


మెట్రోబ్రాండ్స్‌ ఆపరేషన్స్‌ ఆదాయం 59.02 శాతం పెరిగి రూ.483.77 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఇది రూ.304 కోట్లు. ఇక కంపెనీ మొత్తం ఖర్చులు ఈ క్వార్టర్లో 47 శాతం పెరిగి రూ.362 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఈ సంఖ్య రూ.246 కోట్లుగా ఉంది. కంపెనీ చరిత్రలోనే పన్నులు, తరుగుకు ముందు, తీసేసిన తర్వాత అత్యుత్తమ ఫలితాలని సీఈవో నిసాన్‌ జోసెఫ్‌ తెలిపారు.


'చిన్న, మధ్య, పెద్ద నగరాల్లో కంపెనీ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంది. ఈ-కామర్స్‌, ఓమ్ని ఛానల్‌ బిజినెస్‌ సైతం మెరుగైంది. ప్రస్తుత కరోనా పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ఎలాంటి అడ్డంకులు వస్తాయో అంచనా వేస్తున్నాం. ఉద్యోగులు, ప్రజల భద్రత, స్థానిక ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తాం' అని జోషెఫ్‌ వెల్లడించారు. 


మెట్రో బ్రాండ్స్‌ షేరు ధర ప్రస్తుతం రూ.507గా ఉంది. కొన్ని రోజుల క్రితం కంపెనీ ఐపీవోకు వచ్చింది. డిస్కౌంట్‌తోనే నమోదైంది. ఆ తర్వాత షేరు ధర ఆల్‌టైం కనిష్ఠమైన రూ.426కు చేరుకుంది. కొన్ని రోజులు లాభాల్లో ట్రేడ్‌ అవుతూ రూ.507కు చేరుకుంది.


నోట్‌: స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది! ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఫలానా స్టాక్‌, ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలు పరిశీలించుకొని, విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి!


Also Read: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!


Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!


Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!


Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!


Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్‌ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!