Odisha Saffron Lady Who Makes 10 Lakh Per Kg For The Kesar She Grows At Home: వర్క్ ఫ్రం హోం ఇప్పుడు కామన్ కావొచ్చు కానీ ఫార్మింగ్ ఇన్ హోం మాత్రం కామన్ కాదు. బాల్కనీ తోటలు.. మిద్దె తోటలు చాలా ప్రచారం జరిగినా చేయలేక చాలా మంది పక్కన పెట్టేస్తారు. అయితే లక్షలు ఆదాయం వచ్చే పంటలు అయితే వదిలేస్తారా?. కానీ అలాంటి లక్షలు వచ్చే పంటలు ఏముంటాయని చాలా మంది అనుకుంటారు..కానీ ఉంటాయి.. అలాంటి పంటల్నికనిపెట్టారు ఒడిషాకు చెందిన సుజాత అగర్వాల్. వాటిని తెచ్చి తన ఇంట్లోనే పెంచుతూ లక్షలు సంపాదిస్తున్నారు కూడా.
కుంకుమపువ్వుకు చాలా డిమాండ్ ఉంది. కేజీ పది లక్షలు వరకూ ఉంటుంది. అంత విలువైనది ఎక్కడ పడితే అక్కడ ఎలా పండుతుంది. కానీ తన ఇంట్లో పండించి తీరాలని ఒడిషాకు చెందిన సుజాత అగర్వాల్ నిర్ణయించుకున్నారు. హోమ్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన సుజాత ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు హైడ్రోపోనిక్ వ్యవసాయం గురించి చదివారు. ఆ సమయంలో కుంకుమపువ్వును ఆ పద్దతిలో పెంచితే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు.
నీటిలో మొక్కలను పెంచగలమని చూసి నేను ఆశ్చర్యపోయానని..దానిపై మరింతగా పరిశోధన చేశానని సుజాత అగర్వాల్ చెబుతున్నారు. అయితే మొదటగా ఆమె కుంకుమ పువ్వు సాగును ప్రారంభించలేదు. మొదట 320-ప్లాంటర్ సెటప్‌లో పెట్టుబడి పెట్టారు. మొదట ఖరీదైన పువ్వులను సాగు చేయాలని ప్రయత్నించారు. అయితే అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కానీ వైఫల్యాన్ని ఆమె అంగీకరించలేదు. అందుకే రెండో సారి మరో విభిన్నమైన ప్రయత్నం చేశారు. ఈ సారి మంచి ఫలితం వచ్చింది. తన హైడ్రోసోనిక్ వ్యవసాయంలో సాగు చేసిన వాటిని చుట్టుపక్కల వారికే అమ్మేవారు. వారి నుంచి మంచి స్పందన రావడంతో మరితంగా విస్తరించారు. ఆమె 200 రకాల మైక్రోగ్రీన్‌లను పెంచుతున్నారు.
ఓ రోజు పూజ చేసేటప్పుడు కుంకుమ పువ్వు అయిపోవడాన్ని గుర్తించారు. అప్పుడే దాన్ని ఎలా సాగు చేస్తారో అన్న డౌట్ వచ్చింది. నెట్‌లో ఎలా సాగు చేయాలో పరిశీలించారు. పుస్తకాలు చదివారు. స్వయంగా కుంకుమపువ్వు సాగను పిరశీలించారు. 2023లో చిన్న గదిలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. బాగా పరిశోధించి చేయడం వల్ల ఆమె చాలా వేగంగా పంటను చేతికి వచ్చేలా చేసుకోగలిగారు. విలువైన కుంకుమపువ్వును ఏరోపోనిక్ పద్ధతుల ద్వారా విజయవంతంగా పెంచడం ద్వారా... భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.
మొదట కశ్మీర్ నుంచి రెండున్నర లక్షల పెట్టుబడితో కుంకుమపువ్వు నారును తీసుకు వచ్చారు. తర్వాత వాటిని కూడా తనే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటున్నారు. సుజాత అగర్వాల్ తాను ఇంట్లో చేస్తున్న ఈ హైడ్రోసోనిక్ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చి వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు.
Also Read: లాభాలు తగ్గినా బ్లింకిట్‌లోకి పెట్టుబడుల పంపింగ్ - జొమాటో వ్యూహం ఏంటి?