LTIMindtree Q1 Results: 


ఐటీ సేవల కంపెనీ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTI Mindtree) జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది. రూ.1151 కోట్ల ఏకీకృత నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.1106 కోట్లతో పోలిస్తే కేవలం నాలుగు శాతమే వృద్ధి సాధించింది. అయితే వార్షిక ప్రాతిపదికన ఆపరేషన్స్‌ రెవెన్యూ 14 శాతం పెరిగి రూ.8,702 కోట్లకు చేరుకుంది. మార్కెట్‌ అంచనాలతో పోలిస్తే ఆదాయం, లాభం తక్కువగానే ఉంది.


'మా ఆదాయంలో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, మానుఫ్యాక్చరింగ్‌ అండ్‌ రిసోర్సెస్‌, హై టెక్‌, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాలు అత్యంత కీలకం. 75 శాతం ఆదాయం వీటి నుంచే వస్తుంది. ఇవన్నీ మెరుగైన ప్రదర్శనే చేశాయి' అని ఎల్‌టీఐ మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ దేబాశీశ్‌ ఛటర్జీ అన్నారు. జూన్‌ క్వార్టర్‌ ఎబిటా వార్షిక ప్రాతిపదికన 9 శాతం పెరిగి రూ.1635  కోట్లకు చేరింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన ఎబిటా మార్జి 19.5 నుంచి 18.8 శాతానికి తగ్గింది. సీక్వెన్షియల్‌ పద్ధతిలో ప్రస్తుత వృద్ధి కేవలం 0.1 శాతంగానే ఉంది.


ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే బ్యాకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ 12 శాతం వృద్ధి సాధించింది. హైటెక్‌, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కేవలం ఒక శాతమే పెరిగింది. అమెరికా ఆదాయం 10 శాతం, ఐరోపా ఆదాయం 7 శాతం వరకు పెరిగింది. మిగిలిన దేశాల నుంచి వచ్చే ఆదాయం 2.6 శాతం మేర తగ్గింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ 19 మంది కొత్త క్లెయింట్లను చేర్చుకుంది. మొత్తం యాక్టివ్‌ క్లెయింట్ల సంఖ్య 723కి చేరుకుంది. ఇదే త్రైమాసికంలో 1.41 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది.


జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. మార్చిలో 84,546 మంది ఉండగా ఇప్పుడు 82,738కి చేరుకుంది. అట్రిషన్‌ రేటు 20.2 నుంచి 17.8 శాతానికి తగ్గింది. సోమవారం ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేరు రూ.46 పెరిగి రూ.5139 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆరంభంలో రూ.4,322గా ఉన్న షేరు ధర ఇప్పుడు రూ.5139కి చేరింది. అంటే 18 శాతం రాబడి ఇచ్చింది.


Also Read: ఎక్కువ వడ్డీ చెల్లించే గవర్నమెంట్‌ పాపులర్‌ స్కీమ్‌ - ఇకపై 3 బ్యాంకుల్లో!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial