Latest Gold-Silver Prices 29 October 2024: ఈ రోజు ధనత్రయోదశి (ధన్‌తేరస్‌). ఇవాళ ఒక్క గ్రాము బంగారమైన కొనాలన్నది భారతీయుల సెంటిమెంట్‌. ఈ పండుగ నాడు పసిడి రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్‌ కారణంగా పుత్తడి ప్రకాశం అమాంతం పెరిగింది. మన దేశంలో, ఈ రోజు, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 650 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 600 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 490 రూపాయల చొప్పున పెరిగాయి. వెండి రేటు 1,000 రూపాయలు జంప్‌ చేసింది.

యూఎస్‌లో ఎలక్షన్‌ ఫీవర్‌ కారణంగా గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్‌ బీపీ పెంచుకుంటోంది, రికార్డ్‌ స్థాయిలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రస్తుతం, ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,766 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,450 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,750 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ.60,340 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,06,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,450 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.73,750 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ.60,340 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,06,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 80,450 ₹ 73,750 ₹ 60,340 ₹ 1,06,900
విజయవాడ ₹ 80,450 ₹ 73,750 ₹ 60,340 ₹ 1,06,900
విశాఖపట్నం ₹ 80,450 ₹ 73,750 ₹ 60,340 ₹ 1,06,900

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)  
చెన్నై ₹ 7,375 ₹ 8,045  
ముంబయి ₹ 7,375 ₹ 8,045  
పుణె ₹ 7,375 ₹ 8,045  
దిల్లీ ₹ 7,375 ₹ 8,045  
 జైపుర్‌ ₹ 7,375 ₹ 8,045  
లఖ్‌నవూ ₹ 7,375 ₹ 8,045  
కోల్‌కతా ₹ 7,375 ₹ 8,045  
నాగ్‌పుర్‌ ₹ 7,375 ₹ 8,045  
బెంగళూరు ₹ 7,375 ₹ 8,045  
మైసూరు ₹ 7,375 ₹ 8,045  
కేరళ ₹ 7,375 ₹ 8,045  
భువనేశ్వర్‌ ₹ 7,375 ₹ 8,045  

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,577
షార్జా ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,577
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,577
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,087 ₹ 7,546
కువైట్‌ ₹ 6,808 ₹ 7,428
మలేసియా ₹ 7,094 ₹ 7,441
సింగపూర్‌ ₹ 7,040 ₹ 7,751
అమెరికా ₹ 6,894 ₹ 7,314

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ.670 పెరిగి రూ.28,130 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: ధన్‌తేరస్‌ సందర్భంగా నగలు కొనేప్పుడు ఈ టిప్స్‌ పాటించండి, మీకు డబ్బు కలిసొస్తుంది!