Latest Gold-Silver Prices 22 November 2024: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య వార్‌ టెన్షన్ల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనం స్వర్ణానికి గణనీయంగా గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,687 డాలర్ల వద్దకు చేరింది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 870 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 800 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 660 రూపాయల చొప్పున పెరిగాయి. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,250 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,120 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,01,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 72,250 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,120 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,01,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 78,820 ₹ 72,250 ₹ 59,120 ₹ 1,01,000
విజయవాడ ₹ 78,820 ₹ 72,250 ₹ 59,120 ₹ 1,01,000
విశాఖపట్నం ₹ 78,820 ₹ 72,250 ₹ 59,120 ₹ 1,01,000

 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,225 ₹ 7,882
ముంబయి ₹ 7,225 ₹ 7,882
పుణె ₹ 7,225 ₹ 7,882
దిల్లీ ₹ 7,240 ₹ 7,897
 జైపుర్‌ ₹ 7,240 ₹ 7,897
లఖ్‌నవూ ₹ 7,240 ₹ 7,897
కోల్‌కతా ₹ 7,225 ₹ 7,882
నాగ్‌పుర్‌ ₹ 7,225 ₹ 7,882
బెంగళూరు ₹ 7,225 ₹ 7,882
మైసూరు ₹ 7,225 ₹ 7,882
కేరళ ₹ 7,225 ₹ 7,882
భువనేశ్వర్‌ ₹ 7,225 ₹ 7,882

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,849 ₹ 7,402
షార్జా ‍‌(UAE) ₹ 6,849 ₹ 7,402
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,849 ₹ 7,402
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,979 ₹ 7,429
కువైట్‌ ₹ 6,679 ₹ 7,295
మలేసియా ₹ 6,865 ₹ 7,149
సింగపూర్‌ ₹ 6,819 ₹ 7,566
అమెరికా ₹ 6,590 ₹ 7,012

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 260 తగ్గి రూ. 26,110 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌