Ooty and Coonoor Budget trip From Hyderabad : ఫ్యామిలీతో లేదా సోలోగా మీరు ఊటీ వెళ్లాలనుకుంటున్నారా? కానీ ఖర్చు ఎక్కువ అని ఆగిపోతున్నారా? సరైనా ప్లాన్ ఉండాలే కానీ.. లో బడ్జెట్​తో కూడా మీరు మీకు నచ్చిన ప్లేస్​లు చుట్టి వచ్చేయొచ్చు. మీ దగ్గర 8 వేలు ఉంటే.. కూనూర్, ఊటీ రెండూ చూసి వచ్చేయొచ్చు. ఎలా వెళ్లాల్లి? ఏ ప్లేస్​లు చూడాలి? స్టేయింగ్ ఎక్కడా? భోజనానికి ఎంత? ఇలా అన్ని క్వశ్చన్స్​కి జవాబు తెలుసుకుంటూ.. తక్కువ బడ్జెట్​లో ఊటీ, కూనూర్​ని ఎలా కవర్ చేయవచ్చో చూసేద్దాం. 


ట్రైన్ డిటైల్స్.. 


హైదరాబాద్​ నుంచి ప్రారంభమైతే.. ప్రతిరోజు రాత్రి 7.05కి కాచిగూడా నుంచి మైసూరుకు ట్రైన్ (KCG MYS SF EXP 12785) ఉంటుంది. ఉదయం 09.30కి మీరు మైసూరు రీచ్ అవుతారు. స్లీపర్ క్లాస్​లో టికెట్ తీసుకుంటే రూ.435. మైసూరు రీచ్ అయిన తర్వాత.. స్టేషన్ బయట ఊటీకి వెళ్లేందుకు చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటాయి. 


మైసూర్ టూ ఊటీ


టూర్స్ అండ్ ట్రావెల్స్​లో నలుగురు కలిసి క్యాబ్ బుక్ చేసుకుంటే రూ.12,000 పడుతుంది. మీరు మూడు రోజులు సైట్​సీయింగ్​ కోసం, మళ్లీ తిరిగి మైసూర్ దగ్గర డ్రాప్ చేయడం కోసం దీనిని బుక్ చేసుకోవచ్చు. మైసూర్ నుంచి ఊటీ వెళ్లేందుకు నాలుగు గంటలు పడుతుంది. ఇలా నలుగురు కలిసి క్యాబ్ బుక్ చేసుకుంటే.. ఒక్కో మనిషికి రూ.3,000 ఛార్జ్ అవుతుంది. 


స్టేయింగ్ కోసం..


ఊటీలో హాస్టల్ ధరలు రూ.500 నుంచి ప్రారంభమవుతాయి. హోటల్ ధరలు 1,000 నుంచి ప్రారంభమవుతాయి. 


ఫుడ్.. 


రోజుకి 500 నుంచి 700 వేసుకోవచ్చు. ఎంట్రీ టికెట్స్, అండ్ టాయ్ ట్రైన్​కి రూ. 1000. మైసూరు నుంచి హైదరాబాద్ ట్రైన్ రోజూ ఉంటుంది. KACHEGUDA EXP(12786) ఇది మధ్యాహ్నం 3.15కి మొదలైతే.. మార్నింగ్ 5.40కి మీరు హైదారాబాద్లో ఉంటారు. ఈ ట్రిప్ 3Days, 2 Nights కోసమే. 


సోలోగా వెళ్లేవారికి.. 


మీరు ఒంటరిగా ట్రిప్​కి వెళ్తుంటే.. మైసూర్ నుంచి ఊటీకి మూడురోజులకు క్యాబ్ మాట్లాడుకుంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది. కాబట్టి మైసూర్ నుంచి ఊటీకి వెళ్లేందుకు, ఊటీ నుంచి మైసూర్ వచ్చేందుకు మీరు KSRTC లేదా TSRTC బస్సులు ఎంచుకోవచ్చు. దీనికి 5 గంటలు సమయం పడుతుంది. రౌండ్ ట్రిప్ 500ల్లో అయిపోతుంది. స్టేయింగ్ కోసం హాస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. ఊటీలో లోకేషన్సు చూసేందుకు.. మీలాగే సోలోగా వచ్చిన వారితో కలిసి.. ఓ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.  



ఊటీలో చూడాల్సిన ప్రదేశాలు


పైన్ ఫారెస్ట్స్, బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, వెన్​లాక్ డౌన్ నేచర్ ట్రైల్, కర్ణాటక హార్టీకల్చర్, పైకారా నది, పైకారా వాటర్ ఫాల్స్, డొబ్బాబెట్టా పీక్, టీ ఎస్టేట్స్ అండ్ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఊటీ నది, Avalanche నది, ఎమరాల్డ్ నది ఇవన్నీ మీరు ఊటీలో చూడొచ్చు. 


కూనూర్​లో చూడాల్సిన ప్రదేశాలు


సిమ్స్ పార్క్, డాల్ఫిన్ నోస్, లాంబ్స్ రాక్, టాయ్ ట్రైన్ రైడ్, టెలిస్కోప్ వ్యూ పాయింట్, టీ ఎస్టేట్స్, చాక్లెట్ మ్యూజియం, ఆల్​ సైంట్స్ చర్చ్, లాస్ ఫాల్స్, స్ట్రాబెర్రీ ఫామ్స్ చూడొచ్చు. 


Also Read : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే