Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ ఫోన్ రింగ్ అయితే అది చూసిన కాంచన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. జ్యోత్స్న చాలా సంతోషంగా కార్తీక్‌ అనుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే కాంచన థ్యాంక్యూ అంటుంది. అత్తా నువ్వేంటి బావ ఫోన్ లిఫ్ట్ చేశావ్ అని అడుగుతుంది. దానికి కాంచన రెస్టారెంట్‌లో నా కోడలితో గొడవ పడ్డావంట అని అడుగుతుంది.


జ్యోత్స్న: మరి నేను ఎవరిని.
కాంచన: నువ్వు నా మేనకోడలివే దీప నా కోడలు.
జ్యోత్స్న: అత్తా నీ కొడుకుకి ఫోన్ ఇవ్వు నేను ఫోన్ చేసింది మీరు ఎప్పుడో నాకు భర్తని చేసిన నా బావకి విష్ చేయడానికి.
కాంచన: అలా అయితే నువ్వు ముందు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పు తర్వాత బర్త్‌డే విషెష్ చెప్దువు.
జ్యోత్స్న: మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను అత్త నాతో నా జీవితంతో ఆడుకుంటున్నారా.
కాంచన: మేమంతా ఇప్పుడు గుడికి వెళ్తున్నాం తర్వాత చేయవే.
జ్యోత్స్న: ఫోన్ పెట్టావంటే బాగోదు చెప్తున్నా. 


Also Read: 'మెకానిక్ రాకీ' ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ వరస్ట్... సెకండాఫ్ సూపర్ - మరి విశ్వక్ సేన్ హిట్ కొడతాడా?


జ్యోత్స్నని దూరం పెడితేనే కార్తీక్, దీప సంతోషంగా ఉంటారని అనుకొని జ్యోత్స్న నెంబరు కార్తీక్ ఫోన్‌లో డిలీట్ చేసేస్తుంది. ఇక పారిజాతం దీప అందర్ని మనకు దూరం చేసేస్తుందని దీపని ముందు లేకుండా చేయాలని అంటుంది. వాళ్లు గుడికి వెళ్తున్నారని జ్యోత్స్న చెప్తుంది. ఇక కార్తీక్, దీప, శౌర్యలు గుడిలో శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దీప కార్తీక్‌ని వెనకనుంచి ఢీ కొడుతుంది. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. కాంచన మురిసిపోతుంది. దీప కూడా చిన్నగా నవ్వుతుంది. ఇక గుడిలో ఇద్దరూ ఒకే సారి గుడి గంట కొట్టడం ఒకర్ని ఒకరు చూసుకోవడం జరుగుతుంది. కాంచన పంతులుతో కొడుకు కోడలు మనవరాలి పేరున అర్చన చేయమని అంటుంది. కార్తీక్ బొట్టు పెట్టుకొని దీపకి బొట్టు పెడతాడు. ఇక శౌర్య దీప, కార్తీక్ ఇద్దరూ కలిసి గంట కొట్టించాలని అంటుంది. ఇద్దరూ ఎత్తుకొని పాపతో గంట కొట్టిస్తారు. ఇద్దరినీ నువ్వే కలుపుతావని నాకు తెలుసే శౌర్య అని కాంచన మనసులో అనుకుంటుంది. 


ఇక కాంచన దారం దీపకి ఇచ్చి రావి చెట్టుకు కట్టమని చెప్తుంది. కార్తీక్‌ని కూడా పంపిస్తుంది. దీప చెట్టు చుట్టూ తిరుగుతూ చెట్టుకు కడుతుంది. కార్తీక్  వెళ్లి నా భార్యలా పూజ చేస్తున్నావా మా అమ్మ కోసం చేస్తున్నావా నువ్వు నీలా ఉండు దీప నవ్వుతూ సంతోషంగా ఉండు అని చెప్తాడు. ఇక దీప పూజ తర్వాత తాళి తీసి దండం పెట్టుకొని బొట్టు పెడుతుంది. దీప అలా చేయడం కార్తీక్ చూస్తాడు. దీప కార్తీక్‌ని చూస్తుంది. ఇద్దరూ చిన్నగా నవ్వుకుంటారు. మరోవైపు జ్యోత్స్న కూడా చీర కట్టుకొని రెడీ అవుతుంది. దీప వాళ్లదగ్గరకు వెళ్తానని జ్యోత్స్న అంటే పారిజాతం వద్దని అంటుంది. నేను ప్లాన్ ప్రకారమే వెళ్తానని జ్యో చెప్తుంది. విషయం ఎవరికీ తెలీకుండా చూసుకోమని అంటుంది.



మరోవైపు రాత్రి దీప, కార్తీక్‌ వాళ్లు కార్తీక దీపాన్ని సిద్ధం చేస్తుంటారు. జ్యోత్స్న అక్కడికి వస్తుంది. వదిన గుర్తొచ్చిందని కాంచన అంటుంది. దాంతో జ్యోత్స్న నువ్వు బాధ పడుతున్నావ్ అనే వచ్చాను అత్త అని అంటుంది. ఇంట్లో చెప్పి వచ్చావా అని కార్తీక్ అంటే చెప్తే పంపిస్తారా అందుకే ఎవరికీ తెలీకుండా వచ్చానని అంటుంది. బావ అంటే నాకు ఎంతో ప్రేమ అని బావకి కూడా నేను ఇష్టమని ప్రతీ పుట్టిన రోజుకి బావ నాకు ఏదో గిఫ్ట్ ఇస్తాడని అంటుంది. తాను వేసుకున్న నెక్లెస్ కూడా బావ ఇచ్చిందే అంటాడు. కత్తి కంటే మాటతో చేసే గాయాలు చాలా బాధగా ఉన్నాయని కొందరు గాయం చేస్తే కొందరు ఆ గాయాలు మోస్తుంటారు అని అంటాడు. జ్యోత్స్న మనసులో నువ్వు ఎంత తిట్టినా నేను రియాక్ట్ అవ్వను బావ అని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న నా వల్ల ఎవరూ బాధ పడొద్దు నేను వెళ్లిపోతా అని జ్యో అంటే కాంచన ఆపి నువ్వు మాతోనే ఉండమని అంటుంది. ఇక కోనేటిలో కార్తీక్ దీపం ఎందుకు వదులుతారో చెప్పమని జ్యోత్స్న దీపని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: మాటలే కానీ ఆటల్లేని విష్ణు.. కంట్రోల్ తప్పిన పృథ్వీ.. మెకానిక్ రాకీ ప్రమోషన్స్