Suma Adda New Promo: యాంకర్ సుమ హోస్టుగా చేస్తున్న పలు టీవీ షోలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. చక్కటి సమయ స్ఫూర్తితో యాంకర్ సుమ వేసే పంచులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ప్రతి వారం ‘సుమ అడ్డా’ పేరుతో ఆడియెన్స్ కు ఫుల్ నవ్వుల విందును వడ్డిస్తోంది. ఏండ్లు గడుస్తున్నా మంచి వ్యూస్ అందుకుంటున్నది. ప్రతి వారం సినిమా తారలను, లేదంటే బుల్లితెర యాక్టర్లను తీసుకొచ్చి సరదాగా ఎంటర్ టైన్ మెంట్ పంచుతున్నారు. తాజాగా ఈవారానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.   


‘సుమ అడ్డా’కు వచ్చిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు   


‘సుమ అడ్డా’ షోకు బుల్లితెర నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు  పల్లవి ప్రశాంత్, భోలే షావలి, దామిని, ఫైమా, గీతూ, కీర్తి భట్‌ గెస్టులుగా వచ్చాయి. వారు స్టేజి మీదికి అడుగు పెట్టగానే ఎప్పటి లాగే సుమ పంచులు వేయడం మొదలుపెట్టింది. “రేపొద్దున సుమ అడ్డా మాదిరిగా గీతూ అడ్డా అని ఇంకో షో పెట్టాలి” అంటుంది గీతూ. “వద్దులేమ్మా.. ఈ టైటిల్ దీనికొక్కదానికే సరిపోతుంది” అంటూ సుమ ఫన్నీగా రిప్లై ఇస్తుంది. అటు షావలిపైనా పంచులు వేసింది. “మొన్న చిరంజీవి గారి ఇంట్లో కోటును తీసుకొచ్చినట్లు..  మీరు నా రెండు నైటీలు తీసుకొచ్చేశారు” అంటూ భోలే షర్ట్ పై మంచులు వేసింది. ఇక లాలీ పాప్ ను గాల్లోకి ఎగరేసి, నోటితో క్యాప్ పట్టాలనే టాస్క్ ఇస్తుంది సుమ. ఫైమా, దామిని ప్రయత్నించినా ఓడిపోతారు. పల్లవి ప్రశాంత్ మాత్రం చక్కగా నోటితో క్యాచ్ పడతాడు. “నీకన్నీ అలా కలిసొస్తున్నాయి అంతే” అంటూ పంచులు వేస్తుంది. ఆ తర్వాత ఫైమాతో చేయించిన దెయ్యం స్కిట్ అందరినీ ఆకట్టుకుంటుంది.


Also Read: హీరోగా ఎంట్రీ ఇస్తున్న అమ్మ రాజశేఖర్ కొడుకు - ‘తల’ టీజర్ చూశారా?


‘సుమ అడ్డా’లో రెచ్చిపోయిన గెస్టులు


‘సుమ అడ్డా’ షోలో సుమ బిగ్ బాస్ లాంటి గేమ్ ప్లాన్ చేస్తుంది. ఓవైపు దామిని, భోలే షావలి, పల్లవి ప్రశాంత్ కూర్చుంటారు. మరోవైపు కీర్తి భట్, గీతూ మాత్రమే కూర్చుంటుంది. “నువ్వెందుకు రాలేదు?” అని ఫైమాను సుమ అడుగుతుంది. “ఫస్ట్ రౌండ్ ఆడేటప్పుడు వాళ్లిద్దరూ అనుకుని వెళ్లిపోయారు. నేనొక్క దాన్ని ఉన్నా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు” అంటుంది. గీతూ ఫైమా మీద ఒంటికాలుతో లేస్తుంది. అటు ఫైమా “నువ్వు తోపు లెక్క బిహేవ్ చెయ్యొద్దు” అంటూ గీతూకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. తర్వాత భోలే షావలితోనూ గీతూ తగువు పెట్టుకుంటుంది.  “ఎన్ని ఇగోలు రా బాబోయ్” అని సుమ ఆశ్చర్యపోతుంది. గీతూ పల్లవి ప్రశాంత్ మీద కూడా నోరు పారేసుకుంటుంది. “నువ్వు అక్కడ చేసిన కథలంతా నా ముందు చేయొద్దు” అంటూ ప్రశాంత్‌ కి గీతూ వార్నింగ్ ఇస్తుంది. “మీరు ఏదో రియాలిటీ షోలో ఉన్నప్పుడు మిగిలినవి ఇక్కడ తేల్చుకుంటున్నారా?” అంటూ సుమ పంచ్‌ లు వేస్తుంది.  ఇక ‘సుమ అడ్డా’ షోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలంటే నవంబర్ 26 రాత్రి 9.30 గంటల ఆగక తప్పదు.


Also Readక్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే