Latest Gold-Silver Prices 07 November 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు ప్రభావం పసిడిపై గట్టిగా పడింది. ట్రంప్‌ గెలిస్తే డాలర్‌ బలపడుతుందన్న అంచనాలతో పెట్టుబడులు అటు వైపు తరలివెళ్తున్నాయి. దీంతో, గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ వెలవెలబోతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రస్తుతం, ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,662 డాలర్ల వద్ద ఉంది. ఈ ప్రభావం మన దేశ బులియన్‌ మార్కెట్‌పైనా పడింది. ఈ రోజు, మన దేశంలో, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర అతి భారీగా 1,790 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 1,650 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 1,350 రూపాయల చొప్పున పతనమయ్యాయి. కిలో వెండి రేటు ఏకంగా 3,000 రూపాయలు తగ్గింది. 

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,560 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,910 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,02,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,560 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 72,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,910 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,02,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 78,560 ₹ 72,000 ₹ 58,910 ₹ 1,02,000
విజయవాడ ₹ 78,560 ₹ 72,000 ₹ 58,910 ₹ 1,02,000
విశాఖపట్నం ₹ 78,560 ₹ 72,000 ₹ 58,910 ₹ 1,02,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,200 ₹ 7,856
ముంబయి ₹ 7,200 ₹ 7,856
పుణె ₹ 7,200 ₹ 7,856
దిల్లీ ₹ 7,215 ₹ 7,871
 జైపుర్‌ ₹ 7,215 ₹ 7,871
లఖ్‌నవూ ₹ 7,215 ₹ 7,871
కోల్‌కతా ₹ 7,200 ₹ 7,856
నాగ్‌పుర్‌ ₹ 7,200 ₹ 7,856
బెంగళూరు ₹ 7,200 ₹ 7,856
మైసూరు ₹ 7,200 ₹ 7,856
కేరళ ₹ 7,200 ₹ 7,856
భువనేశ్వర్‌ ₹ 7,200 ₹ 7,856

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,033 ₹ 7,595
షార్జా ‍‌(UAE) ₹ 7,033 ₹ 7,595
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,033 ₹ 7,595
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,103 ₹ 7,563
కువైట్‌ ₹ 6,819 ₹ 7,440
మలేసియా ₹ 7,029 ₹ 7,373
సింగపూర్‌ ₹ 7,024 ₹ 7,733
అమెరికా ₹ 6,912 ₹ 7,333

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 60 పెరిగి రూ. 26,660 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: బిలియన్ డాలర్ల ఆస్తులు, కోట్ల విలువైన కార్లు - డొనాల్డ్ ట్రంప్‌ సంపద ఎంతో తెలుసా?