Latest Gold-Silver Price Today 12 August 2023: యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌, డాలర్‌ ఇండెక్స్‌ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు అమాంతం పడిపోయింది, గత ఏడు వారాల్లో లేనంత వరస్ట్‌ సిట్యుయేషన్‌లోకి చేరింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,945 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర ₹ 150 తగ్గింది. స్వచ్ఛమైన పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటులోనూ ఎలాంటి మార్పు లేదు.


తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు:


తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,550 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,510 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 54,550 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 59,510 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 76,200 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 54,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,840 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,550 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,510 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,660 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,550 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,510 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,550 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,510 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,550 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,510 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.


ప్లాటినం ధర (Today's Platinum Rate)
10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 20 తగ్గి ₹ 24,280 వద్దకు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.


ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ప్రభావం అనేక రంగాలపై పడింది. ఫలితంగా ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial