వాస్తు నిర్మాణ శాస్త్రం మాత్రమే కాదు. ఇదొక జీవన విధానాన్ని తెలిపే శాస్త్రంగా చెప్పవచ్చు. వాస్తును అనుసరించి ప్రతి దిక్కుకు ఒక ప్రత్యేకశక్తి ఉంటుంది.  ఈ వాస్తు నియమాలు జీవితంలో సుఖ సంతోషాలకు, సమృద్ధికి అవసరమైనవి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో దరిద్రం చేరవచ్చు. ఆహారానికి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. ఈ చిన్న నియమాలు పెద్ద ఫలితాలను ఇస్తాయి.  వాటి గురించి తెలుసుకుందాం.


దక్షిణం వద్దు


వాస్తు ప్రకారం ఆహారం తీసుకునే సమయంలో దిక్కులను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. భోంచెయ్యడానికి తూర్పూ లేదా ఉత్తరం దిక్కులు ఉత్తమమైనవి. దక్షిణ దిక్కుగా కూర్చుని భోంచెయ్యకూడదు. దక్షిణం యమస్థానం. అందువల్ల ఈ దిక్కుగా కూర్చుని భోంచెస్తే ఆయుష్షు తగ్గుతుంది. దురదృష్టవంతులవుతారు.


Alos Read: ఆగష్టు 12 రాశిఫలాలు, ఈ రాశులవారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు!


పశ్చిమం కూడా


వాస్తు ప్రకారం భోంచేసేందుకు పశ్చిమం కూడా అంత శుభప్రదం కాదు. పడమర వైపు కూర్చుని భోంచేస్తే అప్పులు పెరుగుతాయని నమ్మకం. తూర్పూ లేదా ఉత్తరం వైపు చూస్తూ తీసుకోవాలి. ఈ రెండింటిని దేవతలు కొలువుండే దిక్కులుగా పరిగణిస్తారు. కనుక ఇటువైపు కూర్చుని ఆహారం తీసుకుంటే లక్ష్మీ కటాక్షం దొరకుతుందట. ఆరోగ్యం కూడా బావుంటుందని పండితులు చెబుతున్నారు.


Also Read: ఇంట్లో ట్యాపులు లీకవుతూనే ఉన్నాయా - అయితే ఈ సమస్యలు తప్పవు!


వాస్తులో మరి కొన్ని భోజన నియమాలు



  • వాస్తు ప్రకారం కాళ్లకు చెప్పులు ధరించి ఆహారం తీసుకోవద్దు. ఇలా చెయ్యడం వల్ల భోజనాన్ని అగౌరవ పరిచినట్టవుతుంది.

  • మంచం మీద కూర్చుని కూడా భోంచెయ్యొద్దు. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పించవచ్చు.

  • ఎల్లప్పుడు స్నానం తర్వాతే భోంచెయ్యాలి. స్నానం తర్వాత శుభ్రమైన దుస్తులు దరించి భోంచెయ్యాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి మాత్రమే కాదు అన్నపూర్ణ ఆశీస్సులు కూడా లభిస్తాయి

  •  పగిలిన లేదా విరిగిన పళ్లెంలో భోంచెయ్యకూడదు. అంతేకాదు చేతిలో పట్టుకుని కూడా భోంచెయ్యవద్దు.

  • భోంచెయ్యడానికి వంటిల్లు లేదా దాని పరిసర ప్రాంతాలు ఉత్తమమైన ప్రదేశాలు.

  • సహజమైన గాలి వెలుతురు వచ్చే ప్రదేశంలో భోంచెయ్యాలి.

  • తినడానికి సరిపడినంత మాత్రమే వడ్డించుకోవాలి. ఎక్కువ వడ్డించుకుని వృథా చెయ్యకూడదు. ఇది ఆహారానికి అవమానమే. ఇలా భోజన పదార్థాలు వృథా చేస్తే అది ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానించినట్టే

    ఈ చిన్న చిన్న నియమాలను పరిగణనలోకి తీసుకుని జీవితం కొనసాగిస్తే పెద్దపెద్ద కష్టాలను సునాయసంగా దాటేవీలుంటుంది. కనుక వీటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు.


    Also read : నిద్రకూ ఉన్నాయి వాస్తు నియమాలు - ఇలా చేస్తే మీ జీవితానికి కలిగే మేలు ఇదే!


  • Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


    ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


    Join Us on Telegram: https://t.me/abpdesamofficial