search
×

Droneacharya Aerial Innovations IPO: లిస్టింగ్‌ రోజే మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌, వండర్‌ చేయబోతున్న స్టాక్‌ ఇది!

IPO సైజ్‌ కేవలం 33.97 కోట్ల రూపాయలు. కానీ, BSE డేటా ప్రకారం, ఇది మొత్తం 243.70 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది.

FOLLOW US: 
Share:

Droneacharya Aerial Innovations IPO: ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ NSE SME ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (IPO) స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్టర్ల నుంచి అత్యంత భారీ స్పందన వచ్చింది. ఈ కంపెనీ షేర్ల మీద పెట్టుబడిదారుల మామూలు ఉత్సాహంగా లేరు. ఈ IPO గురువారం (డిసెంబర్ 15, 2022) క్లోజయింది. 

పుణె కేంద్రంగా పని చేస్తున్న ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ IPO సైజ్‌ కేవలం 33.97 కోట్ల రూపాయలు. కానీ, BSE డేటా ప్రకారం, ఇది మొత్తం 243.70 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది. సులభంగా చెప్పాలంటే, ఒక్క షేరు కోసం దాదాపు 244 దరఖాస్తులు లేదా బిడ్స్‌ వచ్చాయి.

రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 330 రెట్లు సబ్‌స్క్రైబ్
దాదాపు రూ. 34 కోట్ల IPOలో, షేర్లు కావాలంటూ వచ్చిన మొత్తం దరఖాస్తులను లెక్కిస్తే, వాటి విలువ రూ. 8285.8 కోట్లుగా తేలింది. ఇది రికార్డ్‌ సబ్‌స్క్రిప్షన్‌. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసిన కోటా ఏకంగా 330.82 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) కూడా ఎక్కడా తగ్గలేదు. వాళ్లకు కేటాయించిన పోర్షన్‌ 287.80 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇవి కూడా రికార్డులే.

ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ IPO 2022 డిసెంబర్ 13 నుంచి 15 తేదీల మధ్య బిడ్స్‌ కోసం ఓపెన్‌ అయింది. IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.52-54 గా కంపెనీ నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేవలం 2000 షేర్లను ఈ కంపెనీ కేటాయించింది. ఈ ప్రకారం రూ.1.08 లక్షలకు ఉంచింది. ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ శంకర్ శర్మ పూణేకు చెందిన డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్‌లో పెట్టుబడులు పెట్టారు.

GMPలో విపరీతమైన జంప్
IPO పెట్టుబడిదారుల నుంచి వచ్చిన ఈ అద్భుత స్పందన తర్వాత, ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్ షేర్లకు పెద్ద రెక్కలు వచ్చాయి. గ్రే మార్కె ప్రీమియంలో (GMP) విపరీతమైన జంప్ కనిపించింది. గ్రే మార్కెట్‌లో ఈ స్టాక్ గురువారం రూ. 70 ప్రీమియం డిమాండ్‌ చేస్తే, ఇవాళ (డిసెంబర్‌ 16, 2022) అంతకు మరో 2 రూపాయలు పెరిగి, రూ. 72 ప్రీమియంతో ట్రేడవుతోంది. 

లిస్టింగ్‌ రోజునే మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌!
కంపెనీ రూ.54 ధరకు ఒక్కో షేర్‌ను IPOలో ఆఫర్‌ చేస్తుంటే, గ్రే మార్కెట్‌లో ఈ ధర పైన రూ. 72 ప్రీమియంను ఈ షేర్లు డిమాండ్‌ చేస్తున్నాయి. అంటే ఒక్కో షేరు ధర గ్రే మార్కెట్‌లో ఇప్పుడు రూ. 126 (రూ. 54+ రూ. 72) పలుకుతోంది. ఇది దాదాపు 130% ప్రీమియంతో సమానం. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఇదే ధర దగ్గర లిస్ట్‌ కావచ్చని స్టాక్‌ మార్కెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు. అంటే, లిస్టింగ్‌ రోజునే ఇది మల్టీబ్యాగర్‌ రాబడి ఇచ్చే అవకాశం ఉంది.

ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ IPO షేర్లను డిసెంబర్ 20న IPO ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనున్నారు. డిసెంబర్ 23న (శుక్రవారం) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో షేర్లు లిస్ట్‌ అవుతాయని భావిస్తున్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 16 Dec 2022 04:21 PM (IST) Tags: IPO GMP Droneacharya Aerial Innovations Listing Date

ఇవి కూడా చూడండి

Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌

Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌

Swiggy IPO: బచ్చన్‌ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ

Swiggy IPO: బచ్చన్‌ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ

Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్‌ బద్దలవుతుంది!

Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్‌ బద్దలవుతుంది!

Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే

Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే

IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!

IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!

టాప్ స్టోరీస్

Publicity gold: కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?

Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?

Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా

Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా

Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన

Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన

Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో

Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో