Indian Stock Market Holidays List For 2025: కొత్త సంవత్సరం 2025 మరికొన్ని రోజుల్లోనే మన ఇంటి తలుపు తడుతుంది. శని & ఆదివారాలు కాకుండా, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు (NSE & BSE) ప్రతి సంవత్సరం కొన్ని ప్రత్యేక సెలవులు ఉంటాయి. ప్రముఖ పండుగలు, జాతీయ సందర్భాల వంటి సమయాల్లో మన మార్కెట్లు పని చేయవు. మీకు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల మీద ఆసక్తి ఉంటే, షేర్‌ మార్కెట్‌ హాలిడేస్‌ లిస్ట్‌ గురించి ముందుగానే అవగాహన ఉండడం ముఖ్యం. 


2025లో స్టాక్‌ మార్కెట్‌ హాలిడేస్‌ లిస్ట్‌


జనవరిలో...


గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జనవరి 26న దేశవ్యాప్తంగా సెలవు ఇస్తారు. అయితే, ఆ రోజు ఆదివారం. జనవరిలో, భారతీయ స్టాక్‌ మార్కెట్‌కు వచ్చే ఒకే ఒక్క ప్రత్యేక సెలవు అయిన జనవరి 26 ఆదివారం రోజున వచ్చింది కాబట్టి, అది సాధారణ సెలవుల్లో కలిసిపోయింది.


ఫిబ్రవరిలో..


ఫిబ్రవరిలో మహా శివరాత్రి పర్వదినం ఉంది. ఈ సందర్భంగా, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం నాడు స్టాక్ మార్కెట్లు మూతబడతాయి.


మార్చిలో..


హోలీ పండుగ సందర్భంగా, మార్చి 14వ తేదీ బుధవారం రోజున స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. 
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్) సందర్భంగా, మార్చి 31 సోమవారం నాడు మార్కెట్‌లో ట్రేడ్‌ జరగదు. దీనికి ముందు వచ్చే శని, ఆదివారాలను కూడా కలుపుకుంటే, మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తాయి. ఈ సమయంలో ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి.


ఏప్రిల్‌లో...


మహావీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 10 గురువారం రోజున స్టాక్ మార్కెట్ క్లోజ్‌ అవుతుంది. 
డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఏప్రిల్ 14 సోమవారం నాడు షేర్‌ మార్కెట్‌లో ఏ పనీ జరగదు.


మే నెలలో...


మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా, మే 01 బుధవారం నాడు స్టాక్ మార్కెట్ సెలవు ఉంటుంది.


జూన్ & జులై నెలల్లో మార్కెట్‌కు ప్రత్యేక సెలవులు లేవు. శని, ఆదివారాలు తప్ప మిగిలిన రోజుల్లో యథావిథి పని చేస్తుంది.


ఆగస్ట్‌లో...


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఆగస్ట్ 15 శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్ సెలవు తీసుకుంటుంది. శని, ఆదివారాల్లోనూ మార్కెట్‌ పని చేయదు కాబట్టి, ఇక్కడ కూడా లాంగ్‌ వీకెండ్‌ వచ్చింది. ఈ సమయంలోనూ ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి.
ఆగస్ట్ 27 బుధవారం నాడు వినాయక చవితి సందర్భంగానూ మార్కెట్‌లో లావాదేవీలు జరగవు.


సెప్టెంబర్‌లో వారాంతపు సెలవులు తప్ప  స్టాక్ మార్కెట్‌కు అదనపు సెలవులు లేవు.


అక్టోబర్‌లో...


గాంధీ జయంతి సందర్భంగా, అక్టోబర్ 02వ తేదీ గురువారం రోజున స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించరు.
దీపావళి లక్ష్మీ పూజ కారణంగా, అక్టోబర్ 21 మంగళవారం నాడు స్టాక్ మార్కెట్‌కు సెలవు.
దీపావళి-బలి ప్రతిపద రోజున, అక్టోబర్ 22 బుధవారం నాడు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ ఉండదు.


నవంబర్‌లో...


ప్రకాష్ గురుపురబ్ (గురునానక్ జయంతి) సందర్భంగా నవంబర్ 05వ తేదీ బుధవారం రోజున స్టాక్ మార్కెట్‌కు హాలిడే.


డిసెంబర్‌లో...


క్రిస్మస్ సందర్భంగా, డిసెంబర్ 25 గురువారం రోజున స్టాక్ మార్కెట్‌కు సెలవు.


వచ్చే ఏడాదిలో, ఆదివారం నాడు వచ్చిన గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సెలవును మినహాయించి, మిగిలిన నెలల్లో స్టాక్‌ మార్కెట్‌కు మొత్తం 13 ప్రత్యేక సెలవులు వచ్చాయి. వీటిలో రెండు లాంగ్‌ వీకెండ్‌లు ఉన్నాయి.


మరో ఆసక్తికర కథనం:  యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!