India to overtake US Economy: మరికొన్నేళ్లలో, సెకండ్ సూపర్ ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. జపాన్, జర్మనీనే కాదు, అమెరికాను కూడా దాటేసి ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందంటూ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది.
టాప్-10 ఎకానమీలు
ప్రస్తుతం, 3,750 బిలియన్ డాలర్ల GDPతో భారతదేశం ప్రపంచంలో 5వ అతి పెద్ద ఎకానమీగా ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో అమెరికా (26,854 బిలియన్ డాలర్లు), సెకండ్ ర్యాంక్‌లో చైనా (19,374 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో జపాన్ (4,410 బిలియన్ డాలర్లు), ఫోర్త్ ప్లేస్‌లో జర్మనీ (4,309 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఇండియా తర్వాత... ఆరో స్థానంలో బ్రిటన్ (3,159 బిలియన్ డాలర్లు), సెవెన్త్ ప్లేస్‌లో ఫ్రాన్స్ (2,924 బిలియన్ డాలర్లు), ఎయిత్ ర్యాంక్‌లో ఇటలీ (2,170 బిలియన్ డాలర్లు), 9వ స్థానంలో కెనడా (2,090 బిలియన్ డాలర్లు), పదో స్థానంలో బ్రెజిల్ (2,080 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
GDP పరంగా చూస్తే, ప్రస్తుతం, అమెరికా-భారత్ మధ్య బోలెడంత గ్యాప్ ఉంది. అయితే, 2075 నాటికి (మరో 50 ఏళ్లలో) ఈ గ్యాప్ ఫిల్ కావడమే కాదు, అమెరికా కంటే ఇంకా ఎత్తుకు ఇండియా చేరుకుంటుందని గోల్డ్‌మన్ సాక్స్ రిపోర్ట్ చేసింది.
జనాభానే అతి పెద్ద అడ్వాంటేజ్
140 కోట్లు దాటిన జనాభా భారత్‌కు అతి పెద్ద ఆస్తిగా గోల్డ్‌మన్ సాక్స్ చెబుతోంది. దీంతోపాటు, సరికొత్త ఇన్నోవేషన్స్ & టెక్నాలజీ, అధిక మూలధన పెట్టుబడులు, వర్కర్ ప్రొడక్టివిటీ పెరగడం వంటివాటిని తన అంచనాకు ఆధారాలుగా ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ చూపుతోంది.
"రాబోయే 20 ఏళ్లలో, ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశ డిపెండెన్సీ రేషియో చాలా తక్కువగా ఉంటుంది" అని రిపోర్ట్‌లో వెల్లడించింది. అంటే, ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. మేక్ ఇన్ ఇండియా, లోకల్ టు గ్లోబల్, ఆత్మనిర్బర్ భారత్ లాంటి పథకాలను దృష్టిలో పెట్టుకుని గోల్డ్‌మన్ సాచ్స్ ఈ కామెంట్స్ చేసింది.
పడిపోతున్న డిపెండెన్సీ రేషియోలు, పెరుగుతున్న ఆదాయాలు, ఆర్థిక రంగంలో బలమైన అభివృద్ధి కారణంగా భారతదేశ సేవింగ్స్ రేట్ పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా, మరిన్ని మూలధన పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి" - గోల్డ్‌మన్ సాచ్స్
రోడ్లు, రైల్వేల ఏర్పాటులో మౌలిక సదుపాయాల కల్పనకు భారత ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రిపోర్ట్‌లో వెల్లడైంది. మరిన్ని ఉద్యోగాలు సృష్టించి దేశంలో అతి భారీ సంఖ్యలో ఉన్న లేబర్ ఫోర్స్‌ను వర్క్‌లోకి తీసుకోవడం ద్వారా, మాన్యుఫాక్చరింగ్ & సర్వీసెస్ కెపాసిటీలను పెంచుకోవడానికి ప్రైవేట్ రంగానికి ఇదే సరైన సమయం అని గోల్డ్‌మన్ సాచ్స్ చెబుతోంది.
డౌన్‌సైడ్ రిస్క్స్
సూపర్ ఎకానమీగా ఇండియా ఎదగాలంటే కొన్ని రిస్క్‌లను తట్టుకుని ముందుకెళ్లాలి. వాటిలో ప్రధానమైంది లేబర్ ఫోర్స్. ఇండియన్ ఎకానమీలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరగకపోతే ఆర్థిక వృద్ధి రిస్క్‌లో పడుతుందని తన రిపోర్ట్‌లో గోల్డ్‌మన్ సాచ్స్ హెచ్చరించింది. "భారత్‌లో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు గత 15 సంవత్సరాలుగా తగ్గింది" అని రిపోర్ట్‌లో వెల్లడించింది. రిపోర్ట్‌లో అండర్‌లైన్ చేసిన మరో పాయింట్.. "లేబర్ ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్య రేటు పురుషుల కంటే చాలా తక్కువగా ఉంది".
దీనిని బట్టి, పెరుగుతున్న జనాభా భారత్‌కు అతి పెద్ద ఆస్తి. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే భారత్ వెలిగిపోతుంది. జనాభాను ఉపయోగించుకోలేకపోతే, నిరుద్యోగం పెరిగి, ఎకానమీ దిగజారిపోయే ప్రమాదం కూడా ఉంది.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Vedanta, Vadilal, SBI Cards
Join Us on Telegram: https://t.me/abpdesamofficial