Direct Tax Collection Grows: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (2023 ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 17 వరకు) డైరెక్ట్‌ టాక్స్‌ కిట్టీ డబ్బుతో కిటకిటలాడుతోంది. ముందస్తు పన్ను వసూళ్లు (advance tax collection) బాగా పెరగడంతో ప్రత్యక్ష పన్నుల ఖజానా కళకళలాడుతోంది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 17 వరకు, దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 11.18 శాతం పెరిగి రూ. 3.80 లక్షల కోట్లకు (రూ. 3,79,760 కోట్లు) చేరాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ గణాంకాలను ప్రకటించింది.  అంతకుముందు ఆర్థిక సంవత్సరం ‍‌(2022-23) ఇదే కాలంలో, ఈ కలెక్షన్స్‌ రూ. 3,41,568 కోట్లుగా ఉన్నాయి.


జూన్ 17 వరకు అడ్వాన్స్‌ టాక్స్‌ కలెక్షన్స్‌ డేటా             
ఈ ఫిస్కాల్‌ ఇయర్‌లో ఇప్పటి వరకు, అడాన్వ్‌ టాక్స్‌ వసూళ్లు బాగా వచ్చాయి. 2023-24 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జూన్ 17 వరకు, 1,16,776 లక్షల కోట్ల రూపాయల ముందస్తు పన్ను వసూలైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13.70 శాతం ఎక్కువ. నెట్‌ డైరెక్ట్‌ టాక్స్‌ కలెక్షన్స్‌ రూ. 3,79,760 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ. 1,56,949 కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ (corporation tax - CIT) (సిఐటి) వాటా. సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ (securities transaction tax - STT) సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (personal income tax - PIT) రూపంలో రూ. 2,22,196 కోట్లు వసూలు చేశారు.


మరో ఆసక్తికర కథనం: బంగారంపై బంపర్‌ డిస్కౌంట్‌, శుక్రవారం వరకే ఆఫర్‌, 4 కిలోలు కొనే ఛాన్స్‌ 


కార్పొరేట్ టాక్స్‌ వసూళ్లలో క్లాసిక్‌ గ్రోత్‌        
మొత్తంగా, జూన్‌ 17 వరకు, 4.19 లక్షల కోట్ల రూపాయల గ్రాస్‌ డైరెక్ట్‌ టాక్స్‌ (రిఫండ్‌ల జారీకి ముందు) అటు ప్రజల నుంచి, ఇటు కార్పొరేట్‌ కంపెనీల నుంచి వసూలైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12.73 శాతం పెరిగింది. ఇందులో రూ. 1.87 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను వసూళ్లు & రూ. 2.31 లక్షల కోట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ‍‌(సెక్యూరిటీల లావాదేవీల పన్ను సహా) ఉన్నాయి. జూన్ 17 వరకు రిఫండ్‌లుగా (refunds) ఇచ్చిన మొత్తం రూ. 39,578 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, 30 శాతం ఎక్కువ రిఫండ్స్‌ జారీ చేశారు.


ఈ గణాంకాలు మంచి సంకేతం         
2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇప్పటి వరకు, ముందస్తు పన్ను వసూళ్లు 13.7 శాతం పెరిగి రూ. 1,16,776 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని ఇవి రూ. 1,02,707 కోట్లుగా ఉన్నాయి. ముందస్తు పన్ను వసూళ్లు బాగా పెరగడం టాక్స్‌ నెట్‌వర్క్‌ విస్తరిస్తోందనడానికి సూచన. ఆర్థిక కార్యకలాపాల్లో వేగానికి కూడా ఇది నిదర్శనం. దీనిని బట్టి, 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలో డైరెక్ట్‌ టాక్స్‌ కలెక్షన్స్‌ బాగానే ఉండబోతున్నాయని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Kalyan Jewellers, Tata Steel