భారత్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.220 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ( గురువారం) రూ. 45,680 ఉండగా  ఈ రోజు (శుక్రవారం) రూ.45,900 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ( గురువారం) రూ. 46,680 ఉండగా  ఈ రోజు (శుక్రవారం) రూ.46,900 ఉంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిధర నిన్న రూ.60,700 కాగా ఈ రోజు రూ.61,200 ఉంది. అంటే కేజీ వెండి ధర రూ.500 పెరిగింది.  
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల  ధర రూ.47,780 
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130
చెన్నైలో 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,120
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780
వెండిధరలు: బంగారంతో పాటూ వెండిధరలూ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ. 65,200 ఉంది.  ఢిల్లీ, కోలక్ కతా, బెంగళూరు, కేరళ, ముంబైలో కిలో వెండి రూ.61,200 ఉండగా చెన్నైలో రూ.65,200 ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.60వేలకు చేరే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు.


Also Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి