Gold Silver Price Today: భారత మార్కెట్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. నిన్న నిలకడగా ఉన్న పసిడి ధర నేడు పుంజుకుంది. వెండి ధర కిలోకు రూ.200 తగ్గింది. తాజాగా 22 క్యారెట్లపై రూ.150 మేర తగ్గడంతో 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,850 గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత)పై రూ. 170 మేర పెరగడంతో ధర ప్రస్తుతం రూ.48,930 అయింది. ఇక వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు పెరిగింది. రూ.100 మేర పెరగడంతో తాజాగా కిలో రూ.67,900గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 


హైదరాబాద్‌తో పోల్చితే ఏపీలోని విజయవాడలోనూ ధరలు అదే తీరుగా ఉన్నాయి. ఇక విజయవాడలోనూ పసిడి ధర స్వల్పంగాపెరిగి. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారంపై రూ.150 పెరగడంతో ధర నేడు రూ.44,850 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,930గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,280కి చేరగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47000 అయింది. చెన్నై నగరంలో ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది. 22 క్యారెట్ల ఆభరణాలపై రూ.460 మేర పెరగడంతో బంగారం ధర రూ.45,420 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,560గా ఉంది. ముంబయిలో రూ.310 మేరగ బంగారం ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,940 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,940కు చేరుకుంది.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్‌ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!


తగ్గిన ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.20 మేర దిగొచ్చింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,560 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలలో ప్లాటినం ఇదే ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
Also Read: Flipkart Black Friday Offer: ఈ ఐఫోన్‌పై రూ.20 వేలకు పైగా తగ్గింపు.. సూపర్ ఆఫర్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి