Gold Price Today 8th April 2022 Hyderabad: మార్చి నెలలో బంగారం, వెండి ధరలు 9వ తేదీన గరిష్టానికి చేరుకున్నాయి. దాదాపు నెల రోజుల తరువాత చూస్తే బంగారం, వెండి ధరలు తగ్గాయి. గత నెలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. తాజాగా రెండు రోజుల గ్యాప్ తరువాత బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. బంగారం ధర రూ.230 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర (Gold Rates Today In Hyderabad) రూ.48,000కు చేరగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,370 అయింది. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర రూ.300 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.71,000 కు ఎగబాకింది.


ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.230 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 8th April 2022)  10 గ్రాముల ధర రూ.52,370 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000కు పుంజుకుంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.71,000 అయింది.


విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర రూ.200 మేర పెరగడంతో ఈ పట్టణాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000 కు చేరింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.71,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.52,370 కి పెరిగింది. 
చెన్నైలో రూ.190 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,590 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,010 కి చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


ప్లాటినం ధర 
వరుసగా మూడోరోజు ప్లాటినం ధర తగ్గింది. రూ.22 మేర తగ్గడంతో చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,510కి పడిపోయింది. 
హైదరాబాద్‌లో ప్లాటినం ధర రూ.22 దిగిరాగా 10 గ్రాముల ధర రూ.23,510 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.  
ఢిల్లీలో 35 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.23,160 కి చేరింది. 
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,160 అయింది.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Weather Updates: తగ్గేదేలే అంటున్న సూర్యుడు - అగ్నిగుండంలా మారిన రాయలసీమ, తెలంగాణలో 42 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు 


Also Read: KCR : వరి పోరులో బీజేపీని ఫిక్స్ చేయనున్న కేసీఆర్ - 12వ తేదీనే ముహుర్తం ?