Foreign Portfolio Investors: ఫారిన్ కరెన్సీ ప్రవాహాలు ఇండియన్ ఈక్విటీస్ రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. జూన్ నెలలో, ఏడు సెక్టార్లలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) భారీ కొనుగోళ్లు చేశారు. షాపింగ్ లిస్ట్‌లో ఫస్ట్ పేరు ఫైనాన్షియల్ సర్వీసెస్‌ది.
జూన్ నెలలో, ఆర్థిక సేవల రంగంలోకి రూ. 19,229 కోట్ల (2.3 బిలియన్ డాలర్లు) వచ్చి పడ్డాయి. మే నెల కంటే ఇది దాదాపు 9% ఎక్కువ. ఈ ఏడాది మార్చి నుంచి, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ భారీగా 13% లాభపడింది, ఈ వారం ప్రారంభంలో లైఫ్ టైమ్ హైకి చేరుకుంది. ఈ సెక్టోరల్ ఇండెక్స్ గత 5 నెలలుగా విన్నింగ్ రన్‌లో ఉంది.
విచిత్రం ఏంటంటే.. మార్చి త్రైమాసికంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ నుంచి రూ. 16,004 కోట్లు ($1.9 బిలియన్ల ఔట్‌ఫ్లో) బయటకు వెళ్లిపోయాయి. ఆ తర్వాత, మొత్తం జూన్ త్రైమాసికంలో రూ. 44,590 కోట్ల ($5.4 బిలియన్లు) ఇన్‌ఫ్లోస్ వచ్చాయి.
జూన్ నెలలో, డాలర్ల వర్షంలో ఎక్కువగా తడిచిన రెండో సెక్టార్ ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్. జూన్‌లో ఈ రంగంలోకి రూ.5,821 కోట్లు వచ్చాయి. అయితే, మే నెలలో వచ్చిన రూ.8,700 కోట్ల ఇన్‌ఫ్లో కంటే ఇది తక్కువ. నిఫ్టీ ఆటో ఇండెక్స్ నాలుగు నెలల్లోనే 3000 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది, గురువారం రికార్డు స్థాయిలో 15,471 పాయింట్లను స్కేల్ చేసింది. ఈ సెక్టార్‌లోకి వరుసగా ఆరు నెలల పాటు ఫారిన్ పెట్టుబడులు వచ్చాయి.
గత ఐదు నెలలుగా విదేశీయులను ఆకర్షించిన మరో సెక్టార్ క్యాపిటల్ గూడ్స్. గత నెలలో, ఎఫ్‌పీఐలు ఈ రంగంలో రూ. 5,571 కోట్లు కుమ్మరించారు. మేలో పెట్టిన డబ్బు కంటే ఇది 2 రెట్లు ఎక్కువ. ఫిబ్రవరి-జూన్ మధ్య, FPIలు కేవలం క్యాపిటల్ గూడ్స్ కోసమే రూ.14,860 కోట్లు లేదా $1.8 బిలియన్లు పంప్ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు, BSE క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 23% లాభపడింది.
FPIలు డాలర్ల వర్షం కురిపించిన 7 సెక్టార్లు:
ఫైనాన్షియల్ సర్వీసెస్ - మే నెలలో పెట్టుబడి: రూ. 17,671 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 19,229 కోట్లు
ఆటోమొబైల్ & ఆటో కాంపోనెంట్స్ - మేలో పెట్టుబడి: రూ. 8,702 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 5,821 కోట్లు
క్యాపిటల్ గూడ్స్ - మే నెలలో పెట్టుబడి: రూ. 2,505 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 5,571 కోట్లు
కన్జ్యూమర్ డ్యూరబుల్స్ - మే నెలలో పెట్టుబడి: రూ. 1,064 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 3,765 కోట్లు
కన్‌స్ట్రక్షన్ - మే నెలలో పెట్టుబడి: రూ. −344 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 2,888 కోట్లు
పవర్ - మే నెలలో పెట్టుబడి: రూ. −656 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 2,617 కోట్లు
కన్జ్యూమర్ సర్వీసెస్ - మే నెలలో పెట్టుబడి: రూ. 2,865 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 2,301 కోట్లు
ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (FMCG) - మే నెలలో పెట్టుబడి: రూ. 3,235 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 1,968 కోట్లు
హెల్త్ కేర్ - మే నెలలో పెట్టుబడి: రూ. 2,869 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 1,776 కోట్లు
కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ - మే నెలలో పెట్టుబడి: రూ. 1,353 కోట్లు - జూన్‌లో పెట్టుబడి: రూ. 1,685 కోట్లు
వరుసగా నాలుగో నెల కూడా FPIల "హేట్ లిస్ట్"లో ఉన్న సెక్టార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. గత నెలలో, ఐటీ కంపెనీలకు చెందిన రూ.3,355 కోట్ల విలువైన షేర్లను ఫారినర్లు డంప్ చేసారు. మే నెలలోని అమ్మకాల కంటే ఇది దాదాపు 4 రెట్లు ఎక్కువ. గత నాలుగు నెలల్లో ఎఫ్‌పీఐలు దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ షేర్లను వదిలించుకున్నారు.
మరో ఆసక్తికర కథనం: ఇది టైటన్ టైమ్ - బిజినెస్ అప్‌డేట్‌తో షేర్ల కొత్త రికార్డ్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial