Titan Share Price: టాటా గ్రూప్‌లోని 'ఫ్యాషన్ & లైఫ్ స్టైల్' ప్రొడక్ట్స్‌ అమ్మే టైటన్ కంపెనీ షేర్లు ఇవాళ (శుక్రవారం, 07 జులై 2023) 3.4% ర్యాలీ చేసి, BSEలో, ఫ్రెష్‌గా 52-వీక్స్‌ గరిష్ట స్థాయిని క్రియేట్‌ చేశాయి. రూ.3,211ను టచ్‌ చేశాయి, 


FY24 మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌) సంబంధించి కంపెనీ షేర్ చేసిన బిజినెస్‌ అప్‌డేట్‌ బాగుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ & షేర్లకు డిమాండ్‌ పెరిగింది. హైడ్‌లైన్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌, నిప్టీ ఇవాళ చతికిలపడినా, టైటన్‌ షేర్లు మెరిశాయి.


టైటన్‌ Q1 FY24 బిజినెస్‌ అప్‌డేట్‌
జూన్ త్రైమాసికంలో అన్ని కీలక కన్జ్యూమర్‌ బిజినెస్‌ సెగ్మెంట్లలో రెండంకెల వృద్ధి సాధించినట్లు, Q1లో 20% (YoY) ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు, గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టైటన్ తెలిపింది.


టైటన్ మెయిన్‌ బిజినెస్‌ అయిన ఆభరణాల వ్యాపారం, గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌ కంటే 21% వృద్ధితో ఆకట్టుకుంది. Q1 FY24లో కొత్తగా 26 స్టోర్లు ఓపెన్‌ చేయడంతో, మొత్తం స్టోర్ల సంఖ్య 559కి చేరింది.


"జూన్‌ త్రైమాసికంలో బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ.. ఏప్రిల్‌లో అక్షయ తృతీయ, జూన్‌లో పెళ్లిళ్ల కోసం జ్యువెలరీ కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయి. కీలకమైన బంగారం, స్టడ్‌డ్ సెగ్మెంట్లలో సేల్స్‌ బాగా పెరిగాయి. ఆ త్రైమాసికంలో కొత్త స్టోర్ల ఎడిషన్స్‌, బంగారం అమ్మకాలు, గోల్డ్‌ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌ బాగా పెర్ఫార్మ్‌ చేశాయి" - టైటన్ CFO అశోక్ సోంతలియా


గ్లోబల్‌ రేంజ్‌ పెంచుకుంటున్న టైటన్‌
తనిష్క్, షార్జాలో మరో స్టోర్‌ ఓపెన్‌ చేసింది. దీంతో, టైటన్‌ గ్లోబల్‌ ప్రెజెన్స్‌ గల్ఫ్ ప్రాంతంలో ఏడు స్టోర్లకు, USAలో ఒక స్టోర్‌కు పెరిగింది. ఇండియాలో, తొమ్మిది తనిష్క్‌ స్టోర్లు, ఎనిమిది మియా స్టోర్లు కొత్తగా ప్రారంభమయ్యాయి. 


జూన్‌ క్వార్టర్‌లో జోడించిన 26 కొత్త స్టోర్లలో... 14 స్టోర్లు టైటన్ వరల్డ్‌లో, 9 స్టోర్లు హీలియోస్‌లో, 3 స్టోర్లు ఫాస్ట్‌ట్రాక్‌లో ఉన్నాయి.


టైటన్ వాచ్‌లు & వేరబుల్స్ సెగ్మెంట్‌లో 13% YoY వృద్ధి కనిపించింది. విడివిడిగా చూస్తే.. అనలాగ్ వాచీల విభాగంలో 8%, పేరబుల్స్‌లో 84% గ్రోత్‌ ఉంది.


ఐకేర్ డివిజన్‌ అమ్మకాలు సంవత్సరానికి 10%, ఫ్రాగ్రాన్సెస్‌ & ఫ్యాషన్ యాక్సెసరీస్‌ 11% వృద్ధిని సాధించగా, తనీరా Q1 అమ్మకాలు 81% పెరిగాయి. క్యారట్‌లేన్ కూడా YoYలో 32% గ్రోత్‌ రిపోర్ట్‌ చేసింది.


బిలియనీర్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం లార్జెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్లలో టైటన్‌ ఒకటి. ఈ స్టాక్‌ గత మూడు నెలల్లో 25% పైగా ర్యాలీ చేసింది, గత మూడేళ్లలో దాదాపు 215% రిటర్న్స్‌ ఇచ్చింది.


మరో ఆసక్తికర కథనం: ఐడియాఫోర్జ్‌ అదుర్స్‌! రూ.675 షేరు రూ.1300కు లిస్టింగ్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial