FMCG Stocks: ఎఫ్‌ఎంసీజీ స్టాక్‌ల గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు హెచ్‌యుఎల్ (HUL), నెస్లే (Nestle), డాబర్ (Dabur), బిట్రానియా (Britannia) వంటి ఫేమస్‌ కంపెనీల పేర్లే మొదట గుర్తుకు వస్తాయి. ఈ రంగంలో ఇంకా బోలెడన్ని కంపెనీలు ఉన్నా, వాటి పేర్లు చప్పున స్ఫురించవు. గుర్తుకు రానంత మాత్రాన అవేమీ చెడ్డ కంపెనీలు కావు.   

  


పెద్ద కంపెనీల తయారు చేసే అవే రకం ఉత్పత్తులను తయారు చేస్తున్న, ఫండమెంటల్‌గా బలంగా ఉన్న 4 కంపెనీలను మీ ముందుకు తెస్తున్నాం. ప్రస్తుత స్థాయి నుంచి 33% - 68% వరకు ర్యాలీ చేయగల సత్తా ఈ స్టాక్స్‌ సొంతమని నిపుణులు చెబుతున్నారు.  


ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్‌లో గ్రోత్‌ స్టాక్స్‌: 


స్టాక్‌ పేరు: ప్రతాప్‌ స్నాక్స్‌ (Prataap Snacks)
స్టాక్‌ సగటు స్కోర్‌: 5
ఎనలిస్ట్‌ రికమెండేషన్‌: "స్ట్రాంగ్‌ బయ్‌"
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 68%
కంపెనీ సంస్థాగత పెట్టుబడిదార్ల వాటా: 21
కంపెనీ మార్కెట్‌ విలువ ‍‌(కోట్లలో): 1,658


స్టాక్‌ పేరు: హెరిటేజ్‌ ఫుడ్స్‌ (Heritage Foods)
స్టాక్‌ సగటు స్కోర్‌: 7
ఎనలిస్ట్‌ రికమెండేషన్‌: "స్ట్రాంగ్‌ బయ్‌"
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 48%
కంపెనీ సంస్థాగత పెట్టుబడిదార్ల వాటా: 9
కంపెనీ మార్కెట్‌ విలువ ‍‌(కోట్ల రూపాయల్లో): 1,271


స్టాక్‌ పేరు: దొడ్ల డెయిరీ (Dodla Dairy)
స్టాక్‌ సగటు స్కోర్‌: 10
ఎనలిస్ట్‌ రికమెండేషన్‌: "స్ట్రాంగ్‌ బయ్‌"
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 36%
కంపెనీ సంస్థాగత పెట్టుబడిదార్ల వాటా: 20
కంపెనీ మార్కెట్‌ విలువ ‍‌(కోట్లలో): 2,726


స్టాక్‌ పేరు: జైడస్‌ వెల్‌నెస్‌ (Zydus Wellness)
స్టాక్‌ సగటు స్కోర్‌: 7
ఎనలిస్ట్‌ రికమెండేషన్‌: "స్ట్రాంగ్‌ బయ్‌"
ఇంకా ఎంత శాతం ర్యాలీ చేయవచ్చు: 33%
కంపెనీ సంస్థాగత పెట్టుబడిదార్ల వాటా: 15
కంపెనీ మార్కెట్‌ విలువ ‍‌(కోట్లలో): 9,366


1. "స్ట్రాంగ్‌ బయ్‌" & "బయ్‌" రేటింగ్స్‌ ఉన్న స్టాక్స్‌ను మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.             


2) రాబోయే 12 నెలల్లో కనీసం 10% వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్న స్టాక్స్‌ను ఏరి ఈ లిస్ట్‌ను పేర్చడం జరిగింది.      


3) అధిక వృద్ధి సామర్థ్యాన్ని సామర్థ్యానికి సూచనగా మొత్తం సగటు స్కోర్ 5, అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని ఎంపిక చేశారు.


4) రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న ఉన్న కంపెనీలు మాత్రమే ఈ స్టాక్ సిరీస్‌లో భాగమయ్యాయి.


5) సంస్థాగత సంస్థలు ఎక్కువ ఆసక్తిని చూపుతున్న & కనీసం 5% సంస్థాగత యాజమాన్యాన్ని కలిగి ఉన్న కంపెనీలు ఈ జాబితాలోకి వచ్చాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.