Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకుడి మరణం కంటతడి పెట్టిస్తోంది. బతుకు బాగుంటుందని చాలా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. జాబ్ రాలేదు. వ్యూహాన్ని మార్చుకొని సాఫ్ట్‌వేర్ వేపు చూశాడు. అక్కడ కూడా లే ఆఫ్‌లు టెన్షన్ పెట్టాయి. ఇంతలో ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు వేసింది. వాటికైనా ప్రిపేర్ అయితే లైఫ్‌లో సెటిల్ అవుతాని అనుకున్నాడు. కానీ విజయాన్ని అందుకోక ముందే తనువు చాలించాడు. ప్రయాణాన్ని ముగించేశాడు.
సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన నవీన్ కుమార్‌కు 30 ఏళ్లు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. అనుకున్న ఉద్యోగం రాలేదు. ఒత్తిడి పెరిగింది. తెలిసిన వాళ్ల సలహా మేరకు సాఫ్ట్‌వేర్ వైపు చూశాడు. అక్కడ కూడా ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి. ఇంతలో సాఫ్‌వేర్ ఇండస్ట్రీలో ప్రంకపనలు మొదలయ్యాయి.
ఒత్తిడిలో ఉన్న నవీన్‌కు ఊరిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్సు పడ్డాయి. అంతే మైండ్ సెట్ మారిపోయింది. ప్రైవేటు ఉద్యోగాల వేట వదిలేసి ప్రభుత్వ కొలువు కోసం కొట్లాడ మొదలెట్టాడు. ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రిపీర్ అవుతున్నాడన్న విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్లు బంధువులు చాలా సంతోషించారు.
ఇంతలో ఏమైందో ఏమో కానీ... శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కొలువు కోసం చేస్తున్న పోరాటాన్ని మధ్యలోనే వదిలేసి ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయాడు. నవీన్ ఆత్మహత్య సంగతి తెలుసుకున్న ఫ్యామిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు నాగభూషణం, సుశీల, ఇద్దరు సోదరులు బోరున విలపిస్తున్నారు.
నవీన్ ఆత్మహత్య చేసుకోకు ముందు ఓలెటర్ రాసి పెట్టాడు. తనకు జాబ్ లేదని... తాను పనికిరానివాడనని బాధ పడుతూ లెటర్ రాశాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని... ఉద్యోగం లేకపోవడమే ఇబ్బంది అని అందులో చెప్పాడు.
లెటర్‌లో ఏముంది అంటే... అన్‌సైటిస్ఫైడ్ లైఫ్..నో వన్ రీజన్ ఫర్ దిస్. ఐయామ్ యూజ్ లెస్ ఆల్ జాబ్ లెస్. థాంక్యూ మై ఫ్యామిలీ. ఐ క్విట్ అని రాసి బాధపడుతున్నట్టు ఎమోజీ పెట్టి సంతకం పెట్టి ఉంది.