ట్విట్టర్ డీల్ నుంచి ఎలన్ మస్క్ ఔట్
కొనుగోలు చేయటంలేదంటూ మస్క్ ఝలక్
ఈ మేరకు ప్రకటన చేసిన ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్
మస్క్ పై లీగల్ యాక్షన్ తప్పదన్న ట్విట్టర్ ఛైర్మన్
మస్క్ పై బిలియన్ డాలర్ల పెనాల్టీ పడే అవకాశం
భారత కరెన్సీ లో సుమారుగా రూ. 7.93 వేల కోట్లు పడే ఛాన్స్ 


Elon Musk Terminates Twitter Deal: టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. అగ్రిమెంట్ లో చెప్పిన దానికంటే భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయంటూ కొంతకాలంగా ఎలన్ మస్క్ వరుస ఆరోపణలు చేశారు. తాజాగా ట్విట్టర్ సంస్థ కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు మస్క్. నకిలీ అకౌంట్ల 5 శాతం కంటే తక్కువ ఉన్నాయని ట్విట్టర్ చెబుతున్నా... అది తప్పని మస్క్ వాదిస్తూ వచ్చారు. ట్విట్టర్ డీల్ ను హోల్డ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు మస్క్. అయితే ఇప్పుడు కంప్లీట్ గా డీల్ నుంచి బయటికి వస్తున్నట్లు ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. 






ట్విట్టర్ ఛైర్మన్ ఏమన్నారంటే..
ఎలన్ మస్క్‌తో ట్విట్టర్ డీల్ రద్దయిందని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు. దాన్ని  ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ రీట్వీట్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కుబేరుడు ఎలన్ మస్క్ పై అగ్రిమెంట్ ప్రకారం లీగల్ యాక్షన్ ఉంటుందని టేలర్ తెలిపారు. ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ కొంతకాలం కిందట అంగీకరించారు. ఎడిట్ ఆప్షన్ అంటూ ట్విట్టర్‌లో పెద్ద దుమారమే రేపారు. కానీ అగ్రిమెంట్ ప్రకారం ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయని పక్షంలో 1 బిలియన్ డాలర్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.


ఎలన్ మస్క్ పెనాల్టీ చెల్లిస్తారో లేదా లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు ఆయనకు మరేదైనా దారి ఉందో తెలియాలంటే కొంతకాలం వరకు వేచి చూడక తప్పదు. ఇప్పటివరకైతే ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేయటంపై ఎలన్ మస్క్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ స్పామ్ ఖాతాలు 5 శాతం కంటే తక్కువగా ఉంటేనే ట్విట్టర్ కొనుగోలు చేస్తానని మస్క్ గతంలోనే తెలిపారు. అందుకు భిన్నంగా స్పామ్ ఖాతాలు 15 నుంచి 20 శాతం ఉన్నట్లు గుర్తించిన ఎలన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డీల్‌ను రద్దు చేసుకున్నారు. ట్విట్టర్ తమకు పూర్తి సమాచారం ఇవ్వడంలో విఫలమైందని, తప్పుడు సమాచారం సైతం అందించిందని ఎలన్ మస్క్‌ తరఫు న్యాయవాదులు యూఎస్‌ సెక్యూరిటీస్‌, ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌కు లేఖ సమర్పించారు.
Also Read: Twitter Employees Fired: ఉద్యోగులకు ట్విటర్‌ షాక్‌! 30% మంది తొలగింపు - మస్క్‌ ఎఫెక్టా?


Also Read: Elon Musk on Twitter: గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది-ట్విటర్‌కు పది రోజులు బ్రేక్ ఇచ్చిన ఎలన్ మస్క్