E Post Office Flag: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాత్రంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారానికి మద్దతుగా ప్రతి ఒక్కరు వాట్సాప్, సోషల్ మీడియా ప్రొఫైల్‌గా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. నేటి నుంచి పోస్టాఫీసుల్లో జాతీయ జెండాలు విక్రయిస్తున్నామని పోస్టల్ శాఖ ప్రకటించింది.
'హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఈపోస్టాఫీస్ పోర్టల్‌లో జాతీయ పతకాలు విక్రయించాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. ప్రజలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి డబ్బులు చెల్లిస్తే సమీపంలోని పోస్టాఫీస్ నుంచి జెండాలను డెలివరీ చేస్తాం' అని గతవారం పోస్టల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్ విక్రయాలకు కొన్ని మార్గదర్శకాలనూ విడుదల చేసింది.
Also Read: స్టాక్ మార్కెట్లపై శ్రావణ లక్ష్మీ కరుణ! 58,000 దాటేసిన సెన్సెక్స్, బలపడ్డ రూపాయి
Also Read: 5జీ వేలంలో కేంద్రానికి రూ.1.5 లక్షల కోట్లు! టాప్ బిడ్డర్ ఎవరంటే?
- గంగయాల్, ఈఐపీవో, ఫిలాటెలీ వస్తువుల్లాగే విక్రయించేందుకు ఈపోస్టాఫీస్ పోర్టల్‌లో 20x30 అంగుళాల జాతీయ జెండాను ఎన్‌ఐసీ ఏర్పాటు చేసింది.
- ఒక్కో జెండా ఖరీదు రూ.25. పతాకంపై జీఎస్‌టీ లేదు.
- సన్సద్ మార్గ్ హెడ్ క్వార్టర్స్‌ను నోడల్ కార్యాలయంగా గుర్తించారు. ఈపోస్టాఫీస్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీలు ఇక్కడికే చేరుతాయి.
- ఈపోస్టాఫీస్ పోర్టల్‌లో జాతీయ పతాకం చిత్రాన్ని ఎన్‌ఐసీ ప్రదర్శిస్తుంది. దానిని క్లిక్ చేస్తే జాతీయ జెండా కొనుగోలు చేసేందుకు
- అవసరమైన ఫామ్ వస్తుంది. ఇండియా పోస్టు వెబ్‌సైట్ లింక్ సైతం ఇస్తారు.
- జాతీయ జెండా చిత్రం కింద 'పతాకాన్ని కొనుగోలు చేసేందుకు చిత్రాన్ని క్లిక్ చేయండి' అని రాసుంటుంది.
- కొనుగోలు దరఖాస్తులో డెలివరీ అడ్రస్, ఎన్ని జెండాలు కావాలో తప్పకుండా వివరాలు ఇవ్వాలి. మొబైల్ నంబర్ జత చేయాలి.
- దరఖాస్తు పత్రాలన్నీ నింపిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి.
- ఒకసారి ఆర్డర్ చేస్తే రద్దు చేసుకొనేందుకు వీలుండదు.
- పేమెంటు చేయగానే యూజర్‌కు సమీపంలోని పోస్టాఫీసు నుంచి బుక్ చేసిన అడ్రస్‌కు పతాకాలను డెలివరీ చేస్తారు.
- జాతీయ పతకాలు డెలివరీ చేసేందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు. ట్రాకింగ్ ఫెసిలిటీ లేదు.