income tax on selling gold :  ప్రతి భారతీయ కుటుంబంలో భాగం బంగారం. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో బంగారాన్ని పెట్టుబడిగా భావించేవారు చాలా మంది ఉన్నారు. పెద్దమొత్తంలో కొని రేట్లు పెరిగినప్పుడు అమ్ముతున్నారు. లేకపోతే అప్పుల కారణంగా తనఖా పెట్టి తీర్చే దారి లేక అమ్మేసేవాళ్లు కూడా ఉన్నారు. అలాగే.. గోల్డ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు బంగారంపై పెట్టుబడి బహురూపాలుగా విస్తరించింది. గతంలో అయితే బంగారానికి లెక్కా పత్రం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లెక్కలుండాల్సిందే. 


ఇంట్లో ఉన్న బంగారం అమ్మినా ఇరవై శాతం పన్ను కట్టాల్సిందే         


దీర్ఘ కాల పెట్టుబడులపై లాభాలు వస్తే పన్నులు కట్టాల్సి ఉంటుంది. మరి బంగారం అమ్మినప్పుడు లాభం వస్తే పన్ను కట్టాలా వద్దా అన్నదానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలకు సమాధానమే ఇది. బంగారాన్ని అమ్మి లాభాలు సంపాదిస్తే అందులో ఇరవై శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాల్సిందే. బంగారం కొన్న మూడేళ్ల తర్వాత అమ్మితే ఎంత మొత్తంలో లాభం వచ్చిందో అందులో ఇరవై శాతం క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. దానికి మినహాయింపులు లేవు. 


అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్ - వ్యోమనౌక రిపేర్ కాకపోతే పరిస్థితి ఏమిటి ?


మూడేళ్లలోపు గోల్డ్ బాండ్స్ అమ్మినా  పన్ను కట్టాల్సిందే             


అయితే ఫిజికల్ గోల్డ్ కాకుండా..సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి పథకాలు పెట్టుబడులు పెట్టి  పసంహరించుకుంటే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కాకుండా...వారి ఆదాయపు పన్నులో భాగంగా  కట్టాల్సిఉంది. అదనపు ఆదాయం కింద చూపించి పన్ను కట్టాలి. అయితే ఇది మూడేళ్లలోపు ఉపసంహరించుకుంటేనే. మూడేళ్ల తర్వాత సావరిన్ గోల్డ్ బాండ్స్ లో  పెట్టుబడి ఉపసంహరించుకుంటే.. యాధవిధిగా ఇరవై శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.ఇక్కడ ఇండెక్సేషన్ నిబంధనలు వర్తిస్తాయి. 


భూమికి కాలం చెల్లినట్లేనా - దూసుకొస్తున్న మరో ఆస్టరాయిడ్ - నాసా హెచ్చరికలు


బంగారంపై పన్ను విషయంలో అనేక అపోహలు                                                      


అయితే బంగారం విషయంలో అనేక అపోహలు ఉన్నాయి.ఇంట్లో ఉన్న బంగారంపై పన్ను కటాల్సిన అవసరమే ఉండదు. లెక్కలు ఉన్న బంగారం.. వారసత్వంగా వచ్చినా పన్నులు ఉండవు. అదే సమయంలో వ్యవసాయ ఆధారంగా ఆదాయం వచ్చిన డబ్బులతో  గోల్డ్ కొన్నప్పుడు..వాటిని అమ్మినా పన్ను ఉండదు. ఓ కుటుంబంలో మహిళలు 250 గ్రామల వరకూ ఇంట్లో ఉంచుకోవచ్చు. పురుషులకు వంద గ్రామల వరకూ అవకాశం ఉంది.. అంత కంటే ఎక్కువ ఉంటే మాత్రం.. ఇన్ కంట్యాక్ అధికారులకు రెయిడ్ చేసినప్పుడు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది.