Independence Day Style : స్వాతంత్య్ర దినోత్సవం సమయంలో పిల్లలు స్కూల్​కి అందంగా ముస్తాబై వెళ్తారు. పెద్దలు ఆఫీస్​లకు వెళ్లి జెండా పండుగలో పాల్గొంటారు. పిల్లలు చక్కగా యూనిఫామ్స్​లో వెళ్తే.. పెద్దలు ఇస్త్రీ బట్టలు వేసుకుని.. గుండెపై జెండా బ్యాడ్జ్​ పెట్టుకుని స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇన్​ఫ్లూయెన్సెర్స్​ ఎలా ముస్తాబు కావాలి? ట్రెండీగా, ట్రెడీషనల్​గా ఈ డే కోసం ఎలా ముస్తాబు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రతి ఒక్కరూ ఆగస్టు 15ను తమదైన రీతిలో జరుపుకుంటారు. దేశ స్వాతంత్య్ర కోసం వీరులు చేసిన ప్రాణ త్యాగాల గురించి అందరికీ తెలియజేస్తారు. వారిని ప్రతిబింబించేలా పిల్లలను రెడీ చేసి స్కూల్ కి పంపొచ్చు. అంతేకాకుండా ఆరోజు పలు ఈవెంట్లు, కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా మీరు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవ్వొచ్చు. మరి దీనికోసం ఏ విధంగా ముస్తాబు కావాలి? దేశభక్తి ప్రతిబింభిస్తూ అందంగా కనిపించేలా ఎలా ముస్తాబవ్వాలో చూసేద్దాం.


డ్రెస్ ఎంపిక.. 


స్వాతంత్య్ర దినోత్సవం సమయంలో మీరు రెగ్యూలర్​గా డ్రెస్​లు వేసుకోకుండా చూడీదార్, చీర వంటి వాటిని ప్రిఫర్ చేయాలి. కుదిరితే జెండాలోని మూడు రంగులు ఉండేవి వేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా వైట్ కలర్ డ్రెస్​ను ఎంచుకుని దానిపై దుపట్టా ఫ్లాగ్ కలర్స్ ఉండేవి తీసుకోవచ్చు. చీరకట్టుకుంటే.. దానికి ఫ్లాగ్​ని పెట్టుకోవచ్చు. లేదు మీకు డ్రెస్​ కావాలంటే మార్కెట్లలో ఈ సమయంలో మూడు రంగులు కలిసిన డ్రెస్ దొరుకుతుంది. 


మేకప్.. 


ముఖంపై మేకప్ వేసిన తర్వాత గ్రీన్, వైట్, ఆరెంజ్ లైన్స్ వేసుకోవచ్చు. వాటిపై గ్లిట్టర్ అద్దితే ఇంకా అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ తరహా లుక్​ మీ అందాన్ని పెంచడమే కాకుండా మీ రూపాన్ని విభిన్నంగా ఉంచుతుంది. కళ్లకు జెండారంగులు ఎంచుకుని ఐషాడోగా వేసుకోవాలి. ఇవి కూడా మంచి లుక్​ ఇస్తాయి. 


గాజులు..


డ్రెస్​కి తగ్గట్లు గాజులు ఎంచుకోవచ్చు. కాంబీనేషన్​లో దొరకకుంటే విడిగా తీసుకుని కూడా సెట్ చేసుకోవచ్చు. జెండా రంగుల్లో గాజులు తీసుకుని.. వాటిని మీ డ్రెస్​కి మ్యాచ్ చేసుకోవచ్చు. జెండా రంగుల్లో థ్రెడ్ బ్యాంగిల్స్​ కూడా బాగానే అందుబాటులో ఉంటాయి. 


ఇయర్ రింగ్స్..


చిన్న చిన్న ఫ్లాగ్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. తక్కువ ధరల్లోనే మార్కెట్లలో లభ్యమవుతాయి. వీటిని కొని.. మీరు ఫ్లాగ్ థీమ్ డ్రెస్​ వేసుకోకపోయినా.. ఈ ఇయర్​ రింగ్స్​తో స్వాతంత్య్ర దినోత్సవం వైబ్స్ ఇవ్వొచ్చు. 


నెయిల్ పాలిష్


గోళ్లరంగుతో కూడా మీరు జెండాను క్రియేట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్లు గోళ్లపై నెయిల్ ఆర్ట్ చేసుకోవచ్చు. ఇది గోళ్ల అందాన్ని పెంచడంతో పాటు.. మీ క్రియేటివిటీని ప్రతిబింబించేలా చేస్తుంది. 


ఇవేకాకుండా జుట్టుకి ఫ్లాగ్ కలర్స్​ హెయిర్ బ్యాండ్స్​ తీసుకుని.. వాటిని జడకు లేదా.. చేతికి పెట్టుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ఫ్లాగ్స్​ పెట్టుకోవచ్చు. వీడియోల్లో కొన్ని ఫిల్టర్లు ఉపయోగించి రీల్స్ చేయవచ్చు. వివిధ కార్యక్రమాలకు హాజరు కావొచ్చు. 


Also Read : పెళ్లికోసం బరువు తగ్గుతున్నారా? అయితే నిపుణులు ఇచ్చే సూచనలివే