Best Weight Loss Plan for Brides : బరువు తగ్గితే.. ఏ ఔట్ఫిట్ అయినా మంచి లుక్స్ ఇస్తుంది. అందుకే పెళ్లి సమయం దగ్గరకు వచ్చేసరికి చాలామంది బరువు తగ్గాలని.. ఫిట్‌గా ఉండాలని చూస్తూ ఉంటారు. పైగా ఇది చాలామంది విష్ లిస్ట్‌లో కూడా ఉంటుంది. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు బరువు తగ్గడంలో నిపుణుల సలహాలు కొన్ని ఫాలో అవ్వాలి. ఇవి ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా మీరు ఫిట్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ఇంతకీ నిపుణులు ఇచ్చే సలహాలు ఏమిటి?
నిపుణుల సలహాలు ఇవే
పెళ్లి సమయంలో బరువు తగ్గి.. స్లిమ్‌గా ఉంటే మంచి డ్రెస్‌లు వేసుకోవచ్చు.. ఫోటోలు బాగా వస్తాయనుకుంటారు. అలా బరువు తగ్గడానికి ఏవేవో చేస్తూ ఉంటారు. అయితే పెళ్లికి ముందు బరువు తగ్గడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. పెళ్లి అనే సందర్భం లేకపోయినా.. ఫిట్‌గా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉండాలి. అయితే పెళ్లి దగ్గర్లో ఉన్నప్పుడు ఈ రష్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువసేపు జిమ్ చేస్తే బరువు తగ్గడంతో పాటు.. హెల్త్ కూడా కరాబ్ అవుతుందంటున్నారు నిపుణులు.
రన్నింగ్
ఈ సమయంలో అలాంటి రిస్క్‌లు కాకుండా బరువు తగ్గించడంలో హెల్ప్ చేసే వ్యాయామాలు చేస్తూ ఉంటే మంచిది. కాబట్టి దానికో షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి. దానిని రెగ్యూలర్‌గా ఫాలో కూడా అవ్వాలి. ఇది మీ ఫిట్నెస్ స్థాయిలు పెంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అలా ప్రభావవంతమైన వాటిలో రన్నింగ్ ఒకటి. రోజూ దాదాపు పది నిమిషాలు జాగింగ్ లేదా రన్నింగ్ చేయండి. వార్మప్ చేసి రన్నింగ్ చేస్తే.. సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ సమయాన్ని క్రమంగా పెంచుకోవాలి.
స్క్వాట్స్..
ఇంట్లోనే ఉంటూ.. రెగ్యూలర్‌గా స్క్వాట్స్ చేయొచ్చు. ఇది కాళ్లకు బలాన్ని అందించి.. తొడ దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. స్క్వాట్స్ చేస్తున్నప్పుడు వీపు నిటారుగానే ఉండేలా చూసుకోండి. వీటిని రెగ్యూలర్‌గా చేస్తే బరువును ఈజీగా తగ్గుతారు. లేదంటే బర్ఫీస్ కూడా చేయవచ్చు. స్క్వాట్ చేసి.. అనంతరం బర్ఫీ చేస్తూ.. రెండూ చేయవచ్చు. ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.
ప్లాంక్..
ప్లాంక్ కూడా మంచి ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్గా చెప్పవచ్చు. దీనిని రెగ్యూలర్‌గా చేస్తూ ఉంటే పొట్ట భాగంలో కొవ్వు తగ్గుతుంది. మొత్తం శరీరం స్ట్రాంగ్‌గా మారుతుంది. లేదంటే యోగా చేయవచ్చు. ఇది బరువును తగ్గించడంతోపాటు శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి శ్వాసకు సంబంధించినవి ప్రాక్టీస్ చేయవచ్చు.
ఇవన్నీ బరువును తగ్గించడంతోపాటు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీవక్రియను పెంచి బరువు తగ్గేలా చేస్తాయి. అంతేకాకుండా ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు. అలాగే పెళ్లి అయిపోయింది ఇంక ఫిట్‌గా ఉండడం ఎందుకని నెగ్లెక్ట్ చేయకూడదు. రెగ్యూలర్‌గా ఈ వ్యాయామాలు చేస్తూ ఉంటే.. పెళ్లి తర్వాత కూడా మీరు ఫిట్‌గా ఉంటారు.
Also Read : లెమన్ టీని రోజూ ఉదయాన్నే రెగ్యూలర్‌గా తీసుకుంటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే