DMart Target Priice: డీమార్ట్‌ బ్రాండ్‌తో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను నడుపుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ (Avenue Supermarts) షేర్లు ఇవాళ (సోమవారం, 15 మే 2023) 5% వరకు పడిపోయి రూ. 3,501 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకున్నాయి. మార్చి త్రైమాసిక ఫలితాల్లో ఎబిటా, మార్జిన్స్‌ రెండింటిలోనూ మార్కెట్‌ అంచనాలను ఈ కంపెనీ మిస్ చేసింది. దీంతో, బ్రోకరేజీలు ఈ స్టాక్‌ టార్గెట్ ధరలు తగ్గించి తోక కత్తించాయి.


Q4లో, DMart ఏకీకృత లాభం సంవత్సరానికి 8% పెరిగింది. కంపెనీ ఆదాయంలో 21% YoY పెరిగినప్పటికీ, స్టోర్ల విస్తరణ కారణంగా ఈ వృద్ధి కనిపించింది. గ్రాస్‌ మార్జిన్లు YoYలో 90 bps, QoQలో 13.4%కి క్షీణించాయి. IPO తర్వాత (కొవిడ్ ప్రభావిత త్రైమాసికాల్లో మినహా) డీమార్ట్‌కు ఇదే అతి తక్కువ గ్రాస్‌ మార్జిన్.


జెఫరీస్: తక్కువ స్థూల మార్జిన్లను దృష్టిలో పెట్టుకుని, డీమార్ట్‌ FY24-25 ఆదాయ అంచనాలను ఈ బ్రోకరేజీ 9-10% తగ్గించింది. స్టాక్‌ టార్గెట్ ధరను రూ. 3,425కు కుదించి, 'హోల్డ్' రేటింగ్‌ కంటిన్యూ చేసింది.


నువామా: వృద్ధి, మార్జిన్ అంచనాలను సర్దుబాటు చేస్తూ, డీమార్ట్‌ స్టాక్‌ FY25E EPS అంచనాను 2% తగ్గించింది. స్టాక్‌ టార్గెట్ ధరను రూ. 4,193 నుంచి రూ. 3,913 కి కట్‌ చేసిన బ్రోకరేజీ, 'హోల్డ్' రేటింగ్‌ ఇచ్చింది.


ICICI సెక్యూరిటీస్: డీమార్ట్‌ FY24E /FY25E ఆదాయ అంచనాలను వరుసగా 0.1%/ 1.3% తగ్గించింది. డిమార్ట్‌ స్టాక్‌కు 'హోల్డ్' రేటింగ్‌ను ఈ బ్రోకరేజీ ప్రకటించింది. టార్గెట్ ధరను రూ. 3,900 నుంచి రూ. 3,800కు డీగ్రేడ్‌ చేసింది. ఈ-కామర్స్ కార్యకలాపాల్లో వేగం తగ్గడం, ఊహించిన దాని కంటే ఎక్కువ పోటీ తీవ్రత ఉండటం ప్రధాన రిస్క్‌లుగా బ్రోకరేజీ వివరించింది. ఫుట్‌ఫాల్స్‌లో గణనీయమైన మెరుగుదలను పాజిటివ్‌గా చూస్తోంది.


ఇది కూడా చదవండి: Infosys: ఉద్యోగులకు అద్భుతమైన బహుమతి, వీళ్లు నక్క తోక తొక్కారు 


డీమార్ట్ షేర్ల టార్గెట్‌ ధరలు:


ప్రభుదాస్ లిల్లాధర్: డీమార్ట్‌కు ఉన్న 1500+ స్టోర్ల వల్ల లాభాల టేకాఫ్‌కు భారీ రన్‌వే సిద్ధంగా ఉందని ఈ బ్రోకరేజ్‌ విశ్వసిస్తోంది. దీర్ఘకాలిక లాభాల కోసం 'బయ్‌' చేయవచ్చని సూచించింది. టార్గెట్ ధరను మాత్రం గతంలోని రూ. 4,561 నుంచి రూ. 4,447కి తగ్గించింది.


మోతీలాల్ ఓస్వాల్: కొత్తగా ఓపెన్‌ అయిన స్టోర్లు కంపెనీ వృద్ధికి ప్లస్‌గా చెబుతున్న బ్రోకరేజ్‌, సరుకుల అమ్మకాల్లో సమీప కాల సవాళ్లు, స్టాక్‌ రిచ్ వాల్యుయేషన్‌లు మైనస్‌లని వెల్లడించింది. స్టాక్‌ టార్గెట్‌ ధరను రూ. 3,895గా ప్రకటించింది, 'న్యూట్రల్‌' వైఖరిని కొనసాగించింది.


కోటక్ ఈక్విటీస్: డీమార్ట్‌ బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యంగా ఉందని కోటక్‌ ఈక్విటీస్‌ వెల్లడించింది. కానీ, మూలధన పెట్టుబడులు తగ్గవచ్చని ఊహిస్తోంది. డీమార్ట్‌ స్టాక్‌ టార్గెట్ ధరను గతంలోని రూ. 3,400 నుంచి రూ. 3,475కు పెంచింది.


ఇది కూడా చదవండి: ఈ వారంలో ఎక్స్‌-డివిడెండ్‌ స్టాక్స్‌ - డబ్బులు సంపాదించవచ్చు! 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.