Ex-Dividend Stocks: స్టాక్ మార్కెట్ నుంచి సంపాదించడానికి అవకాశాల కోసం వెతుకుతున్న పెట్టుబడిదారులకు ఈ వారంలో మంచి రోజులు ఉన్నాయి. నేటి (సోమవారం, 15 మే 2023) నుంచి ప్రారంభమై, ఈ వారంలో చాలా కంపెనీల షేర్లు ఎక్స్-డివిడెండ్ స్టాక్స్‌గా ట్రేడ్ అవుతాయి. డివిడెండ్ ప్రయోజనం మీక్కూడా కావాలంటే, ఎక్స్-డేట్ కంటే ముందే ఆ షేర్లను మీ పోర్ట్‌ఫోలియోలోకి తీసుకోవాలి.
డివిడెండ్ చెల్లింపు కోసం ఈక్విటీ షేర్ల ధరను సర్దుబాటు చేసే తేదీని ఎక్స్-డివిడెండ్ తేదీగా పిలిస్తారు. ఈ తేదీన, కంపెనీ ప్రకటించిన డివిడెండ్ మొత్తం షేర్ ధరలో సర్దుబాటు అవుతుంది. సాధారణంగా, రికార్డ్ తేదీ కంటే ఒకటి లేదా రెండు పని దినాల ముందు ఎక్స్ డేట్ ఉంటుంది. అదేవిధంగా, డివిడెండ్ పొందడానికి అర్హులైన వాటాదార్లను జాబితాను నిర్ణయించే తేదీని రికార్డ్ డేట్ అంటారు. డివిడెండ్ పంపిణీ చేసేందుకు మరొక తేదీ ఉంటుంది. దానిని పేబుల్ డేట్ అంటారు.
ఈ వారంలో ఎక్స్-డివిడెండ్ స్టాక్స్:
అనుపమ్ రసాయన్ ఇండియా, సూల వైన్‌యార్డ్స్, టాటా కాఫీ & టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ స్టాక్స్ ఇవాళ ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, కంపెనీ ప్రకటించిన డివిడెండ్ మొత్తం ఆటోమేటిక్‌గా షేర్ ధర నుంచి తగ్గిపోయింది.
GM బ్రూవరీస్ (GM Breweries)
దేశీయ మద్యం తయారీ సంస్థ ఒక్కో షేరుకు రూ. 6 డివిడెండ్ ప్రకటించింది. ఇందుకోసం రికార్డు తేదీని మే 16గా నిర్ణయించింది. అదే రోజున ఈ షేర్ ఎక్స్-డివిడెండ్‌లో స్టాక్ ట్రేడ్ అవుతుంది. గత ఏడాది కాలంలో దీని షేర్ల ధర 7 శాతానికి పైగా పెరిగింది.
HDFC, HDFC బ్యాంక్ (HDFC, HDFC Bank)
HDFC లిమిటెడ్ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ. 44 చొప్పున డివిడెండ్ చెల్లించనుంది. ఈ షేర్ 16 మే 2023న ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్ అవుతుంది. HDFC బ్యాంక్ స్టాక్ కూడా మే 16న ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్ అవుతుంది. ఒక్కో షేరుకు రూ. 19 చొప్పున డివిడెండ్‌ను ఈ బ్యాంక్ ప్రకటించింది.
కోల్గేట్ పామోలివ్ ఇండియా (Colgate-Palmolive India)
ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 21 చొప్పున డివిడెండ్‌ను ఈ FMCG కంపెనీ ప్రకటించింది. కంపెనీ రికార్డు తేదీని మే 20గా నిర్ణయించింది. ఈ షేర్ మే 19న ఎక్స్ డివిడెండ్‌లో ట్రేడ్ అవుతుంది.
హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా (Home First Finance Company India)
ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 2.60 డివిడెండ్ చెల్లించనుంది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీగా మే 19ని కంపెనీ నిర్ణయించింది. ఈ షేర్ కూడా అదే రోజున ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్ అవుతుంది.
జేఎం ఫైనాన్షియల్ (JM Financial)
JM ఫైనాన్షియల్ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 0.90 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఈ షేర్ కూడా మే 19న ఎక్స్ డివిడెండ్‌లో ట్రేడ్ అవుతుంది.
ఇది కూడా చదవండి: Stock Market Opening: 62వేల పైనే సెన్సెక్స్ - ఆల్‌టైమ్ హై రికార్డు బ్రేక్ చేస్తుందా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.