Crypto Tax India: 2022-23 బడ్జెట్ లో ప్రతిపాదించిన వర్చువల్ డిజిటల్ అసెట్స్ పై పన్ను(VDAలు) లేదా "క్రిప్టో ట్యాక్స్" ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. శుక్రవారం లోక్‌సభ 2022-23 క్రిప్టో ట్యాక్స్ సవరణ బిల్లును ఆమోదించింది. వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపుపై స్పష్టీకరణకు సంబంధించి సవరణలను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లులోని సెక్షన్ 115 BBH వర్చువల్ డిజిటల్ ఆస్తులపై ట్యాక్స్ ను నిర్దేశిస్తుంది. IT చట్టంలోని క్లాజ్ (2)(బి)లోని "ఇతర నిబంధన" ప్రకారం క్రిప్టో ఆస్తుల ట్రేడింగ్‌పై నష్టాన్ని నిరోధించేలా సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం "ఇతర" పదం తొలగించారు. సవరించిన చట్టం ప్రకారం క్రిప్టో ఆస్తుల నుంచి వచ్చే నష్టాన్ని క్రిప్టో ఆస్తులలో లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయలేం.


30 శాతం పన్ను 


"క్రిప్టో-ఆస్తులు మూలధన ఆస్తులు కాదా అనే దానితో సంబంధం లేకుండా ప్రతిపాదిత 30 శాతం పన్నును విధిస్తారు. దీని వల్ల వ్యాపారులు పన్నులపై ఆదా చేయలేని విధంగా చేస్తుంది. ప్రస్తుతం క్రిప్టో ఆదాయపు పన్ను పరిధిలో లేదు" అని క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirX వ్యవస్థాపకుడు, CEO నిశ్చల్ శెట్టి అన్నారు. "అంతేకాకుండా పెట్టుబడిదారులు ఒక క్రిప్టో ట్రేడింగ్ నుంచి నష్టాలను మరొక రకం నుంచి లాభాల ద్వారా భర్తీ చేయడానికి అనుమతించకపోవడం క్రిప్టో భాగస్వామ్యాన్ని మరింత అరికట్టడానికి, పరిశ్రమ వృద్ధిని అడ్డుకుంటుంది" అని ఆయన చెప్పారు. కొత్త నిబంధన ప్రభుత్వానికి ఆశించిన ఫలితాలను అందించదని శెట్టి అన్నారు. "ఇది KYC నిబంధనలకు కట్టుబడి ఉండే భారతీయ ఎక్స్ఛేంజీలపై క్యాస్కేడింగ్ భాగస్వామ్యానికి దారి తీస్తుంది. విదేశీ మారకద్రవ్యాలకు లేదా KYC కంప్లైంట్ లేని వాటికి మూలధన ప్రవాహం పెరగడానికి దారితీస్తుంది. ఇది ప్రభుత్వానికి లేదా క్రిప్టో పర్యావరణ వ్యవస్థకు అనుకూలమైనది కాదు." అని అతను చెప్పాడు. 


Also Read : March 31 deadline: డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది! 31లోపు డబ్బు పరంగా ఇవన్నీ చేసేయండి.. లేదంటే!


ఒక క్రిప్టోకరెన్సీలో వచ్చే నష్టాలను మరొకదానిలో లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయలేమని శుక్రవారం లోక్ సభలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక క్రిప్టోకరెన్సీలో మీకు బాగా లాభాలు వస్తే వాటిపై ట్యాక్స్ కట్టడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఒకవేళ వేరే క్రిప్టోకరెన్సీలో మీకు నష్టాలు వచ్చినా ఆ నష్టాలను మైనస్ చేసి మిగిలిన లాభాలపై మాత్రమే పన్ను చెల్లిస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది.


Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్‌ చూడండి మరి!