రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇది ఒక గేమింగ్ ఫోకస్డ్ మొబైల్. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ రెండు బ్యాటరీ వేరియంట్లలో లాంచ్ కానుంది. వీటిలో ఒకటి 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150W ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో రానుండగా... మరొకటి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో రానున్నాయి.
రియల్‌మీ జీటీ నియో 3 ధర
రియల్‌మీ జీటీ నియో 3 80W వెర్షన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా (సుమారు రూ.24,000) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా (సుమారు రూ.27,500), టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్లుగా (సుమారు రూ.31,200) నిర్ణయించారు.
ఇక 150W మోడల్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్లుగా (సుమారు రూ.31,200) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగా (సుమారు రూ.33,600) నిర్ణయించారు. సైక్లోనస్ బ్లాక్, సిల్వర్ స్టోన్, లె మాన్స్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ జీటీ నియో 3 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ ఏకంగా 1,000 హెర్ట్జ్ కావడం విశేషం. హెచ్‌డీఆర్10+, డీసీ డిమ్మింగ్ సపోర్ట్‌ను ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో షూటర్ కూడా ఉండనున్నాయి. ఇందులో 256 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉండనున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్‌లో 150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. ఇక 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్‌లో 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. 150W ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ కేవలం ఐదు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది.