ఉక్రెయిన్‌లో యుద్ధానికి కారణమైన పుతిన్‌పై మీమర్స్ సీరియస్ కామెడీ చేస్తున్నారు. పుతిన్‌పై వైరల్ చేస్తున్న మీమ్స్ హైలెట్ అవుతున్నాయి. ఇటీవల పుతిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున బహిరంగసభల్లో పాల్గొంటున్నారన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే పుతిన్ అసలు బయట కనిపించడం మానేశారని.. తెలిపేందుకు కొంత మంది వినూత్న ప్రయత్నం చేశారు. గ్రీన్ మ్యాట్‌పై లైవ్ ఇస్తూ.. గ్రాఫిక్స్‌తో జనం మధ్యలో ఉన్నట్లుగా చూపిస్తున్నారని చెప్పేందుకు భిన్నమైన మీమ్ క్రియేట్ చేస్తున్నారు. 



పుతిన్ కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ.. రష్యా రూబుల్ ఎంత దారుణంగా పడిపోతుందో వివరణాత్మకంగా ఓ మీమ్‌లో ఓ నెటిజన్ వివరించారు. ఇది వైరల్‌గా మారింది. క్రిమియా, జార్జియా, ఉక్రెయిన్‌లపై విరుచుకుపడినప్పుడు డాలర్‌తో పోలిస్తే రూబుల్ ఎంత పడిపోయిందో ఇందులో వివరించారు. 





కొంత మంది పుతిన్ పేరును విడగొట్టి .. పుట్ ఇన్ అని మార్చేసి.. కొత్త ఉత్పత్తులు ప్రచారంలోకి తెస్తున్నారు. వాటిలో కండోమ్స్ కూడా ఉంటున్నాయి.


 





చరిత్రలో నిలిచిపోయిన నియంతల్లో ఒకరుగా  పుతిన్‌ను అనేక మంది చూపిస్తున్నారు.. దీనికి సంబంధించి క్రియేట్ చేసిన మీమ్‌ వైరల్ అవుతోంది.


 









కొంత మంది హిట్లర్‌ జీవితానికి సంబంధించి తీసిన సినిమాలోని  ఓ సన్నివేశాన్ని చాలా తెలివిగా రష్యా ఆక్రమణకు లింక్ పెట్టేశారు. 





ఉక్రెయిన్‌ను ఓ బెలూన్‌లా భావించి పేల్చేయాలనుకున్నాడని కానీ పుతినే దెబ్బతిన్నారన్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 









యుద్ధంలో రష్యా వెనుకబడుతున్న కొద్దీ ఈ మీమ్స్ పెరుగుతూనే ఉన్నాయి.