NTPC Recruitment 2022 : NTPC లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీపీసీలో 55 ఎగ్జిక్యూటివ్ (కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్), ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్-పవర్ ట్రేడింగ్), ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్-పవర్ ట్రేడింగ్) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 08, 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ careers.ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


NTPC రిక్రూట్‌మెంట్ వివరాలు :



  • ఎగ్జిక్యూటివ్ (కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్) , మొత్తం ఖాళీల సంఖ్య : 50 , పే స్కేల్: 60000/ (నెలకు) , 

  • ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్-పవర్ ట్రేడింగ్)  , ఖాళీల సంఖ్య: 04 

  • ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్-పవర్ ట్రేడింగ్) , ఖాళీల సంఖ్య: 01


అర్హత ప్రమాణాలు :



  • ఎగ్జిక్యూటివ్ (CCPP) : అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత ఫీల్డ్ లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి

  • ఎగ్జిక్యూటివ్ (పవర్ ట్రేడింగ్): అభ్యర్థికి సంబంధిత ఫీల్డ్ లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి


దరఖాస్తు రుసుం



  • నెట్-బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా చలాన్ ద్వారా పరీక్ష రుసుం చెల్లింవచ్చు

  • GEN/OBC/EWS కోసం : రూ.300/-

  • SC/ST/PWD/XSM : ఫీజు లేదు. 


ముఖ్యమైన తేదీలు



  • ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : మార్చి 25, 2022

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 08, 2022

  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : ఏప్రిల్ 08, 2022


ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే? 


అభ్యర్థులు NTPC అధికారిక వెబ్‌సైట్ careers.ntpc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 


ఓఎన్జీసీలో ఉద్యోగాలు


ఆయిల్‌ కంపెనీల్లో పని చేసిన రిటైర్‌ అయిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది ఓఎన్‌జీసీ. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ కంపెనీలో 36 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వేసింది. జూనియర్‌ కన్సల్టెంట్‌, అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయనుందా సంస్థ. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 ఉద్యోగాలను ఫిల్‌ చేయనుంది. ఇందులో జూనియర్‌ కన్సెల్టెంట్‌ పోస్టులు 14 ఉంటే అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 22 ఉన్నాయి. 
ఆయిల్‌ అండ్‌ నేచురల్ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ కంపెనీలో రిటైర్‌ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆయా విభాగాల్లో సుమారు ఐదేళ్లు అనుభవం ఉండాలి.  అభ్యర్థుల వయోపరిమితి 65ఏళ్లు మించి ఉండరాదని నోటిఫికేషన్‌లో పేర్కొంది ఓఎన్‌జీసీ. ఇందులో ఎంపికైన వాళ్లకు నలభై వేల నుంచి అరవై ఆరువేల వరకు జీతం ఇస్తారు.  అర్హులైన అభ్యర్థుల దరఖాస్తు పరిశీలించి వాళ్లకు ముందుగా రాత పరీక్ష పెడుతుంది. అనంతరం వాళ్లను ఇంటర్వ్యూలకు పిలుస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 30 ఆఖరు తేదీగా నిర్ణయించారు. అనుభవ పత్రాలను అప్లికేషన్‌ను సైన్‌ చేసి స్కాన్ కాపీలను BHARGAVA_VIKAS@ONGC.CO.INకు మెయిల్ చేయాలి.