Cryptocurrency Prices Today: ఫ్లాట్‌గా క్రిప్టోలు.. కొనుగోళ్లకు నో అంటున్న ఇన్వెస్టర్లు!

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 1.38 శాతం తగ్గి రూ.37.42 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.67 లక్షల కోట్లుగా ఉంది.

Continues below advertisement

Cryptocurrency Prices Today, 18 December 2021: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం స్తబ్దుగా ఉన్నాయి. కీలక క్రిప్టోలన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.  గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 1.38 శాతం తగ్గి రూ.37.42 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.67 లక్షల కోట్లుగా ఉంది.  బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 0.91 శాతం పెరిగి రూ.3,14,228 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.35 లక్షల కోట్లుగా ఉంది.

Continues below advertisement

బైనాన్స్‌ కాయిన్‌ 0.16 శాతం తగ్గి రూ.42,536, టెథెర్‌ 0.03 శాతం పెరిగి రూ.80.46, సొలానా 0.18 శాతం పెరిగి రూ.14,338, కర్డానో 0.25 శాతం పెరిగి రూ.101, యూఎస్‌డీ కాయిన్‌ 0.08 శాతం పెరిగి రూ.80.43 వద్ద కొనసాగుతున్నాయి. డీఎఫ్‌ఐ మనీ, యార్న్‌ ఫైనాన్స్‌, కర్వ్‌ డీఏవో, ఆవె, డీసెంట్రల్‌, కాంపౌండ్‌, అవలాంచె 8 నుంచి 23 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఒమిస్‌గో, వేవ్స్‌, ఎయిర్‌స్వాప్‌, ఎల్‌రాండ్‌, ట్రాన్‌, ఫైల్‌కాయిన్‌, లైవ్‌పీర్‌ 2 నుంచి 5 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్‌.. పెరగనున్న పన్ను భారం!

Also Read: Worlds First Text Message: ప్రపంచంలోనే మొట్టమొదటి SMSను వేలం వేస్తున్న వొడాఫోన్‌.. ఆ సందేశంలో ఏముందో తెలుసా?

Also Read: Digital Payments in 2021: క్రెడిట్‌ కార్డు యూజర్లు కేక! డిజిటల్‌ చెల్లింపుల మీదే రూ.39,000 కోట్లు ఖర్చు

 

Continues below advertisement
Sponsored Links by Taboola