Central Government Staffers To Likely Get DA Hike In July : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! 2022, జులై 1 నుంచి వేతనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మోదీ నేతృత్వంలోని సర్కారు మరో 5 శాతం డీఏ (Dearness allowance) పెంచేందుకు సిద్ధమవుతోందని సమాచారం. కేబినెట్‌ గనక ఇందుకు ఆమోదం తెలిపితే 34 శాతంగా ఉన్న కరవుభత్యం ఏకంగా 39కి పెరుగుతుంది. పింఛన్‌ దారులకు డీఆర్‌ సైతం పెరగనుంది.


Also Read: కొత్త కార్మిక చట్టాలు - 3 రోజుల వీకాఫ్‌! పెరగనున్న లీవ్స్‌, బేసిక్‌ పే, పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌!


ఏడాదికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం కరవుభత్యం ప్రకటిస్తుంది. జనవరి, జులై నుంచి వీటిని అమలు చేస్తుంటారు. ఈ నెల గడిస్తే జులై వస్తుంది. ద్రవ్యోల్బణం (Inflation) విపరీతంగా పెరగడంతో ఈసారి ఎక్కువ డీఏ (DA) ఇస్తారని సంకేతాలు అందుతున్నాయి. ఆల్‌ ఇండియా సీపీఐ (AICP Index) ఆధారంగా ఉద్యోగులకు డీఏ నిర్ణయిస్తారు. ఈ సారి ధరలు మండిపోతుండటంతో ప్రతి నెలా సూచీ పెరుగుతోంది.


Also Read: డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల కొత్త ప్రాసెస్‌పై ఆర్బీఐ మరో అప్‌డేట్‌!


2022 ఏడాదికి సంబంధించిన మొదటి డీఏను మార్చిలో ప్రకటించారు. 2021 డిసెంబర్లో ఏఐసీపీ 125.4గా ఉంది. డీఏ పెంపునకు దీనినే పరిగణనలోకి తీసుకున్నారు. ఆ తర్వాత సూచీ 0.3 పాయింట్ల పడిపోయి 125.4కు చేరుకుంది. 2022 ఏప్రిల్‌లో 1.7 శాతం పెరిగి 127.7కు చేరింది. నెల రోజుల వ్యవధిలోనే 1.35 శాతం పెరిగింది. ద్రవ్యోల్బణం సైతం 6.33 శాతానికి చేరింది. ఆహార ద్రవ్యోల్బణమైతే 7.05 శాతంగా ఉంది. అందుకే అధిక డీఏకు (Dearness allowance) ఆస్కారం ఉంది. 


ద్రవ్యోల్బణం, ఏఐసీపీ సూచీ పెరగడంతో డీఏ పెరగనుంది. 2022 జనవరికి సంబంధించిన డీఏను మార్చి 30న పెంచారు. 3 శాతం ప్రకటించడంతో 31గా డీఏ 34 శాతానికి చేరింది. ఈసారి ధరలు మరీ కొండెక్కడంతో ఏకంగా 5 శాతం వరకు కరవుభత్యం పెంచేందుకు ఛాన్స్‌ ఉంది. అదే జరిగితే 34గా ఉన్న డీఏ (Dearness allowance) 39కి చేరుతుంది. అలాగే జులై నుంచి బేసిక్‌ సాలరీలో మార్పు చేస్తారని తెలిసింది. గతంతో పోలిస్తే ఎక్కువ మూల వేతనం వస్తుందని సమాచారం.


Also Read: జస్ట్‌ ఒక్క వారంలో 30% పెరిగిన షేర్లు! లిస్ట్‌ ఇదే!