Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh Strong Counter To Bandla Ganesh: 'చోర్ బజార్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయితే... పూరి లేటెస్ట్ మ్యూజింగ్ వింటే బండ్లకు వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది.

Continues below advertisement

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'చోర్ బజార్'. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. 'కన్న కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రాకుండా ముంబైలో ఏం చేస్తున్నావ్?' అంటూ పూరిని బండ్ల ప్రశ్నించారు. అంతే కాదు... పూరి భార్యను సీతమ్మతో పోల్చారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలు చాలా అనుమానాలకు తావు ఇచ్చినట్లు అయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. 

Continues below advertisement

బండ్ల గణేష్ స్పీచ్ గురించి ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరూ ఓపెన్‌గా మాట్లాడలేదు. కానీ, డిస్కషన్స్ జరిగాయనేది మాత్రం వాస్తవం. పూరి జగన్నాథ్ కూడా ఓపెన్ అవ్వలేదు. కానీ, ఆయన లేటెస్ట్ మ్యూజింగ్ వింటే మాత్రం బండ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. మ్యూజింగ్ కింద కామెంట్స్ చూస్తే 'బండ్ల గణేష్ స్పీచ్ కి సంబంధించే...' అని చాలా మంది కామెంట్స్ చేయడం గమనార్హం.
  
అసలు పూరి జగన్నాథ్ ఏం అన్నారు? అనే విషయానికి వస్తే... ''గుర్తు పెట్టుకోండి! మన నాలుక కదులుతున్నంత సేపూ మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే, జీవితంలో ఎక్కువ టైమ్ లిజనర్స్ గా (ఇతరులు చెప్పింది వింటూ) ఉంటే మంచిది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు... క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు... ఆఫీస్ పీపుల్ కావచ్చు... ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయవద్దు. మన వాగుడు మన కెరీర్ ను, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. మీకు సుమతి శతకం గుర్తుండే ఉంటుంది. 'నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి' అని! తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. నీ జీవితం, మరణం నీ నాలుక (మాటల) మీద ఆధారపడి ఉంటాయి'' - ఇదీ పూరి చెప్పినది. ఆయన మాటల్లో ఎక్కడా బండ్ల గణేష్ పేరు లేదు. కానీ, బండ్లను ఉద్దేశించి ఇలా మాట్లాడారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 

Also Read : సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

బండ్ల గణేష్ స్పీచ్ గురించి పూరి జగన్నాథ్ ఇలా స్పందించారనేది నెటిజన్స్ ఫీలింగ్. మరి, మీరు ఏమంటారు?

Also Read : వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్

బండ్ల గణేష్ ఏమన్నారు? అనేది ఈ వీడియోలో చూడండి 

Continues below advertisement