సోషల్ మీడియాలో మాధవన్ మీద కొంత మంది నెటిజన్లు మండి పడుతున్నారు. ఓ నెటిజన్ అయితే సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో అని కామెంట్ చేశారు. దీనికి కారణం ఇస్రో మీద మాధవన్ చేసిన వ్యాఖ్యలే కారణం. అసలు, మాధవన్ ఏమన్నారు? ఈ వివాదం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
మాధవన్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్'. జూలై 1న థియేటర్లలోకి వస్తోంది. మాధవన్ అభిమానులు, సగటు సినిమా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'రాకెట్రీ' ప్రచార కార్యక్రమాల్లో ''స్పేస్‌లోకి రాకెట్ పంపించడానికి ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)కు హిందూ పంచాంగం హెల్ప్ అయ్యింది'' మాధవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు కొందరికి ఆగ్రహాన్ని తెప్పించాయి. మాధవన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్
ఒకరు నోరు మూసుకోమని అంటే... మరొకరు మాధవన్ కూడా వాట్సాప్ అంకుల్ అయ్యారని కామెంట్ చేశారు. 'మాధవన్ నోరు తెరవనంత వరకూ క్యూట్ గా ఉంటారు' ఇంకొకరు ట్వీట్ చేశారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో చాలా మందికి మాధవన్ టార్గెట్ అయ్యారు.
Also Read : డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి