Block Deals In Stock Market: గత మూడు నెలలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో మంచి బూమ్ కనిపిస్తోంది. స్వదేశీ & విదేశీ పెట్టుబడిదార్లు భారీ వాలెట్లు పట్టుకుని మన మార్కెట్‌లోకి వస్తున్నారు. దీంతో, ఈక్విటీ మార్కెట్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా బ్లాక్ డీల్స్ (సింగిల్ డీల్‌తో భారీ స్థాయిలో షేర్లు కొనుగోలు/అమ్మకం) కనిపిస్తున్నాయి. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్ (Carlyle), ఇంటర్నెట్ లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ డెలివెరీ (Delhivery) నుంచి బ్లాక్ డీల్ ద్వారా పూర్తిగా ఎగ్జిట్ తీసుకుంటోంది. ఈ డీల్ ద్వారా తనకున్న మొత్తం 2.53 శాతం వాటాను (1.84 కోట్ల షేర్లు) ఒక్కో షేరుకు రూ. 385.5 చొప్పున అమ్మకానికి పెడుతుంది. నిన్న (బుధవారం, 21 జూన్ 2023) డెలివెరీ షేర్ 0.26% నష్టంతో రూ. 388.10 వద్ద ముగిసింది.
బుధవారం, శ్రీరామ్ ఫైనాన్స్‌లో (Shriram Finance) పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ తన మొత్తం 8.34 శాతం షేర్లను బ్లాక్ డీల్‌లో రూ. 4,630 కోట్లకు విక్రయించింది. పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ (Piramal Enterprises), ఒక్కో షేర్ మీద 4.9 శాతం డిస్కౌంట్‌తో రూ. 1,483 చొప్పున షేర్లను అమ్మేసింది. ఈ బ్లాక్ డీల్ ఫలితంగా శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ 11.20 శాతం లాభంతో రూ. 1,734.20 వద్ద ముగిసింది.
మంగళవారం, Abrdn ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ (Abrdn Investment Management) కూడా HDFC గ్రూప్‌లోని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ HDFC AMCలో తన మొత్తం వాటాను సేల్ చేసింది. వాస్తవానికి, HDFC AMC ప్రమోటర్ కంపెనీల్లో UKకి చెందిన Abrdn ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఒకటి. HDFC AMCలో తనకున్న మొత్తం 10.20% (2.18 కోట్ల షేర్లు) డిస్పోజ్ చేసింది. ఒక్కో షేర్‌ను సగటున రూ. 1,873 చొప్పున అమ్మి, మొత్తం రూ. 4083 కోట్లు సంపాదించింది. ఈ బ్లాక్ డీల్‌లో తర్వాత కూడా HDFC AMC స్టాక్ బలంగా పెరిగింది. మంగళవారం, ఈ షేర్లు 11.28% లాభంతో రూ. 2,104.35 వద్ద ముగిశాయి.
ఈ వారం టిమ్‌కెన్ సింగపూర్ కంపెనీ (Timken Singapore), టిమ్‌కెన్ ఇండియాలో తనకున్న 8.4 శాతం వాటాను (63 లక్షల ఈక్విటీ షేర్లు) బ్లాక్ డీల్ ద్వారా రూ. 1,890 కోట్లకు ఆఫ్‌లోడ్ చేసింది. ఈ డీల్ తర్వాత టిమ్‌కెన్ ఇండియా స్టాక్‌లో భారీగా పతమైనంది.
3 రోజుల్లోనే రూ.10,500 కోట్ల డీల్స్
ఈ వారంలో కేవలం మూడు రోజుల్లోనే మార్కెట్‌లో బ్లాక్ డీల్స్ ద్వారా రూ. 10,500 కోట్లకు పైగా విలువైన షేర్ ట్రాన్జాక్షన్స్ జరిగాయి. ఎన్ని లక్షల షేర్లను అమ్మకానికి పెట్టినా, కొనేవాళ్లు సదా సిద్ధంగా కనిపిస్తున్నారు. బిలియన్ డాలర్ల విలువైన బ్లాక్ డీల్స్ చాలా సులభంగా, విజయవంతంగా పూర్తి కావడం భారత మార్కెట్‌లో ఉన్న బలానికి నిదర్శనం. ఇండియన్ మార్కెట్ మరో శిఖరం వైపు ట్రెక్కింగ్ చేస్తోందని మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Delhivery, ZEE
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial