Banking Sector News: మొండి బకాయిల్ని వసూలు చేసేందుకు ప్రభుత్వం రంగ బ్యాంకులు బాగానే కష్టపడుతున్నాయి. 2015 నుంచి రూ.6.2 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు, రైటాఫ్‌ చేసిన రుణాలను వసూలు చేశాయి. ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడిన 98.5 శాతం మందిపై కోర్టులో దావా వేశాయని తెలిసింది. 2016-21 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.3.36 కోట్ల మూలధనం సమకూర్చింది. మార్కెట్ల ద్వారా బ్యాంకులు అదనంగా రూ.2.99 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి.


ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రొటెక్షన్‌ రేషియో సైతం మెరుగుపడింది. ప్రమాదకరమైన వాటితో పోలిస్తే మెరుగైన రుణాల నిష్పత్తి 2022, మార్చి నాటికి 86.9 శాతానికి పెరిగాయి. 2015, మార్చి నాటికి ఇది 46 శాతం కావడం గమనార్హం. 2015 నుంచి ప్రభుత్వ బ్యాంకులు రూ.5.17 లక్షల కోట్ల ఎన్‌పీఏలను వసూలు చేశాయి. రైటాఫ్ ఖాతాల నుంచి రూ.1.24 లక్షల కోట్లు రికవర్‌ చేశాయి.


Also Read: రెపోరేటుతో EMI భారం పెరిగిందా! ఇలా చేస్తే తక్కువ వడ్డీతో బయటపడొచ్చు!


Also Read: వాహనదారులకు ఊరట! పలుచోట్ల తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇలా


పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి 2022, మార్చి 31 నాటికి 7.4 శాతానికి పడిపోయింది. 2018, మార్చి 31 నాటివి ఇవి 14.6 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ ఎన్‌పీఏ నిష్పత్తి 8 నుంచి 2 శాతానికి తగ్గింది. ప్రెజర్డ్‌ ప్రాపర్టీ 15.3 నుంచి 7 శాతానికి తగ్గిపోయింది.


'మొండి బకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకులు అనేక పద్ధతులు ఉపయోగిస్తున్నాయి' అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. సివిల్‌ కోర్టులు, ట్రిబ్యునళ్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్ సేఫ్టీ క్యూరియాసిటీ చట్టాలను ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నారు. 2013-14లో 1.32 శాతంగా ఉన్న మోసాలు 2021-22లో 0.05 శాతానికి తగ్గాయని వివరించారు. మోసాలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.


2022, మార్చి 31 నాటికి 12,265గా ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల్లో 12,076 మందిపై దావాలు వేయడం గమనార్హం. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు 40.2 శాతంగా ఉంది.