ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా శుక్రవారం బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) బరోడా కిసాన్ దివస్‌ను ప్రారంభించింది. రైతులతో పదిహేను రోజుల పాటు నాలుగో ఎడిషన్ బరోడా కిసాన్ పక్వాడాను నిర్వహించనుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ఆలోచనలకు అనుగుణంగా ‘మన చర్యలే మన భవిష్యత్తు’ థీమ్‌తో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
దేశ ఆర్థిక ప్రగతికి రైతు సమాజం అందిస్తోన్న తోడ్పాటును బరోడా కిసాన్ పక్వాడాలో గుర్తించి ప్రశంసిస్తారు. అంతేకాకుండా రైతులకు చేరువయ్యేందుకు రకరకాల ఈవెంట్స్, నాలెడ్జ్ సిరీస్, సన్మాన కార్యక్రమాలు చేయనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 31, 2021న ముగుస్తుంది. దీంతో రైతులకు భారీ లబ్ది చేకూరుతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 18 జోనల్ కార్యాలయాల్లో "సెంటర్ ఫర్ ఆగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ (CAMP)'' నూతన కేంద్రీకృత వ్యవసాయ రుణాల ప్రాసెసింగ్ కేంద్రాలను బరోడా బ్యాంకు ప్రారంభించింది. సంప్రదాయేతర వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ మార్కెటింగ్‌పై రుణ పంపిణీ వ్యవస్థ (CAMP) దృష్టి సారిస్తుంది. సుశిక్షుతులైన సిబ్బంది రైతులు, వినియోగదారులకు సాయం చేస్తారు.
“2021-22 ఆర్థిక సంవత్సరంలో మా రుణ విభాగం అభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలకం. గోల్డ్ లోన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫైనాన్స్‌కు మేం ప్రాధాన్యం ఇస్తున్నాం. గోల్డ్ లోన్ సెగ్మెంట్‌లో ఏటా 11% అంటే రూ.650.00 కోట్లు, స్వయం సహాయక బృందాల సెగ్మెంట్‌లో 6% అంటే రూ.54.96 కోట్ల వృద్ధిని నమోదు చేశాం. కొవిడ్ తర్వాత వ్యవసాయ రంగంలో మేము బలమైన వృద్ధిని అంచనా వేస్తున్నాం. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు అనేక ప్రయోజనాలు కల్పిస్తూ ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలను (గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం ఎస్‌ఈజడ్‌ల వంటివి) అభివృద్ధి పరుస్తున్నాయి. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు బ్యాంకులకు అవకాశం ఏర్పడుతోంది” అని హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ శ్రీ మన్‌మోహన్ గుప్తా అన్నారు.
Also Read: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్ ఇస్తోందో తెలుసా?
Also Read: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్ పెంపునకు ప్రభుత్వ ఆమోదం
Also Read: పేటీఎంకు ఆర్బీఐ షాక్! కోటి జరిమానా.. వెస్ట్రన్ యూనియన్‌కూ పెనాల్టీ
Also Read: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!