Bank Holidays List For June 2024: ఈ రోజు (శనివారం, 01 జూన్ 2024) బ్యాంక్‌లకు సెలవు అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వార్త పూర్తిగా అబద్ధం. ఈ రోజు ఎలాంటి జాతీయ/ప్రాంతీయ సందర్భం లేదు, పండుగ కూడా కాదు. పైగా, ఈ రోజు రెండో శనివారం కూడా కాదు, మొదటి శనివారమే. కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు అన్ని బ్యాంక్‌లు యథావిధిగా పని చేస్తాయి. మీకేదైనా పని ఉంటే నిరభ్యంతరంగా బ్యాంక్‌కు వెళ్లవచ్చు.
ఈ నెలలో (జూన్ 2024) వివిధ సందర్భాలు, రెండు & నాలుగో శనివారాలు, ఆదివారాల కారణంగా బ్యాంక్‌లు మొత్తం 13 రోజులు పని చేయవు. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి మారతాయి.
ప్రతి నెలలోనూ ఇలాంటి సెలవులు వస్తూనే ఉంటాయి. కాబట్టి, కస్టమర్లు బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ముందుగానే తెలుసుకుని, సేవ్ చేసుకోవడం బెటర్. సెలవు రోజును ముందుగానే తెలీడం వల్ల ఆ రోజున బ్యాంక్‌కు వెళ్లకుండా ఆగొచ్చు, సమయం వృథా కాకుండా ఉంటుంది.
ఈ నెలలో బ్యాంక్ సెలవు రోజులు (Bank Holidays in June 2024):
02 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ రోజే.
08 జూన్ 2024: (రెండో శనివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లను మూసేస్తారు
09 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
10 జూన్ 2024: (సోమవారం), శ్రీ గురు అర్జున్ దేవ్ జీ బలిదానం ----- పంజాబ్‌లో బ్యాంక్‌లకు సెలవు
14 జూన్ 2024: (శుక్రవారం), పహిలి రాజా ----- ఒడిశాలో బ్యాంక్‌లు పని చేయవు
15 జూన్ 2024: (శనివారం), రాజా సంక్రాంతి ----- ఒడిశాలో బ్యాంక్‌లు పని చేయవు
15 జూన్ 2024: (శనివారం), YMA డే ----- మిజోరంలో బ్యాంక్‌లను మూసివేస్తారు
16 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
17 జూన్ 2024: (సోమవారం), బక్రీద్/ఈద్ అల్ అధా ----- కొన్ని రాష్ట్రాలు మినహా జాతీయ సెలవుదినం
21 జూన్ 2024: (శుక్రవారం), వట్ సావిత్రి వ్రతం ----- చాలా రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు సెలవు
22 జూన్ 2024: (శనివారం), సంత్ గురు కబీర్ జయంతి ----- ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లో బ్యాంక్‌లు పని చేయవు. రెండో శనివారం కాబట్టి మిగిలిన రాష్టాల్లోనూ సెలవు.
23 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
30 జూన్ 2024: రెమ్నా ని ----- మిజోరంలో సెలవు. ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు.
ఇప్పుడు టెక్నాలజీ మారింది. సెలవు రోజుల్లోనూ బ్యాంక్ లావాదేవీల విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండడం లేదు. మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు 24X7 అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి బ్యాంక్ సెలవులు నగదు లావాదేవీలపై ప్రభావం చూపడం లేదు. ఈ సేవల్లో ఏదైనా అంతరాయం ఉంటే, మీ బ్యాంక్ ముందుగానే మీకు సమాచారం అందిస్తుంది.
భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి