Brahmamudi Serial Today Episode: కాఫీ తీసుకొచ్చిన కావ్యను ఇందిరాదేవి తిడుతుంది. ఒక మనిషిని అతిగ నమ్మడం కూడా వ్యసనమేనని అర్థం అవుతుంది. అందుకే ఆ వ్యసనాన్ని మానుకోవాలనుకుంటున్నాను. ఎంత వద్దనుకున్నా జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. అంటూ ఇందిరాదేవి బాధపడుతుంది. నీ కాఫీ కూడా నాకు వద్దని చెప్పడంతో కావ్య కాఫీ తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు మాయను వెతుక్కుంటూ వెళ్లిన అప్పు ఒక ఇంటి లోపలికి వెళ్తుంది. ఇంట్లోంచి ఒకరు వచ్చి ఎవరు మీరు అని అడుగుతుంది. నేను మాయ కోసం వచ్చానని మాయకు చిన్నప్పటి ఫ్రెండ్‌నని చెప్పి మాయ ఎప్పుడొస్తుందో తెలుసుకుని తన నెంబర్ తీసుకుని వెళ్తుంది. మరోవైపు కిచెన్‌లో ఆలోచిస్తున్న కావ్య దగ్గరకు మాయ, రుద్రాణి వెళ్తారు.
రుద్రాణి: ఎవరో మనతో చాలెంజ్ చేశారు. ఆట నువ్వు మొదలు పెట్టావు.. గెలుపు నాది అంటూ స్లోగన్స్ చెప్తారు. వాళ్లెవరో నీకు తెలుసా? మాయ.
మాయ: ఇంకెవరు ఈ కళావతి ఓ సారీ అది కేవలం నీ మొగుడు మాత్రమే పిలుస్తాడు కదా? పర్వాలేదులే ఎలాగూ త్వరలో నా మొగుడు అవుతున్నాడు కదా?
రుద్రాణి: ఇప్పుడు అర్థం అయిందా ఈ రుద్రాణి అంటే ఎంటో? చాలెంజ్ చేసినంత ఈజీ కాదు నాతో గెలవడం అంటే
అంటూ ఇద్దరూ మాట్లాడుతుంటే అప్పు, కావ్యకు ఫోన్ చేసి మాయ అడ్రస్ దొరికిందని చెప్పగానే కావ్య ఎంగిలి విస్తరాకు కథ చెప్తుంది. దీంతో అప్పు నాకెందుకు ఈ కథ చెప్తున్నావు అంటే చేరాల్సిన వాళ్లకు చేరిందిలే అని ఫోన్ కట్ చేస్తుంది కావ్య. మరో కథ రుద్రాణి, మాయలకు చెప్పి వెళ్లిపోతుంది కావ్య. ఇంతకీ కావ్య చెప్పిన కథలో గుంటనక్కలు ఎవరు అని అడుగుతుంది మాయ. ఇంకెవరు మనమే అంటుంది రుద్రాణి. తర్వాత అందరూ హాల్‌లో కూర్చుని ఉండగా మాయ లగేజీ తీసుకుని కిందకు వస్తుంది.
స్వప్న: మాయ వెళ్లిపోతుంది. సెండాఫ్ పార్టీ ఇద్దామా?
మాయ: నేను వెళ్లిపోతున్నాను అని ఎవరు చెప్పారు.?
స్వప్న: అంటే వెళ్లిపోవడం లేదా? ఎవరైనా సూట్‌కేసు పట్టుకుని వస్తే దాని అర్థం ఊరెళ్లిపోవడమే.. వచ్చిన చోటికి వెళ్లడం అని అర్తం. తమరేంటి సూటుకేసు పట్టుకుని టాయిలెట్‌కు వెళ్తున్నారా?
రుద్రాణి: మరి రాత్రిపూట సూటుకేసు పట్టుకుని ఎక్కడికి బయలుదేరినట్లు..
అని రుద్రాణి అడగ్గానే నేను రాజ్ గదిలో పడుకుందామని వస్తున్నాను అని చెప్తుంది మాయ. దీంతో అందరూ షాక్ అవుతారు. రుద్రాణి, మాయను సమర్థిస్తుంది. దీంతో రుద్రాణి, మాయలను ఇందిరాదేవి తిడుతుంది. దీంతో ఆ గదిలో ఉండే హక్కు నాకు మాత్రమే ఉంది అమ్మమ్మగారు అంటుంది మాయ.
ఇందిరాదేవి: నోరు మూయ్.. హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇది ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కాబట్టి నిన్ను ఈ గుమ్మంల నిలబడనిచ్చాం. నువ్వు వచ్చి ఏకంగా హక్కుల గురించే మాట్లాడుతున్నావే?
రుద్రాణి: అమ్మా కాస్త ఆగు జరిగిపోయిన దాని గురించి అందరికీ తెలుసు. మన ఇంటి గుట్టు గురించి మనమే బయటకు మాట్లాడుకుందామా? కాస్త ఆవేశం తగ్గించుకో అమ్మా
అపర్ణ: చూడు.. కావ్య సంతకం చేసిందంటే పెళ్లికి అభ్యంతరం లేదని మాత్రమే పెళ్లి కానివ్వు తర్వాత ఎవరు ఎక్కడ ఉండాలో చూద్దాం.
అనగానే రుద్రాణి మా వదిన మాటంటే మాట అంతవరకు నారూంలోనే ఉందువు పదా అంటుంది. అందరూ వెళ్లిపోతుంటే మాయ అపర్ణను అత్తయ్యగారు అని పిలుస్తుంది. దీంతో అపర్ణ నాలిక చీరేస్తానని.. ఈ ఇంటి పరువు కోసం నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను తప్ప నువ్వు చచ్చేదాకా నన్ను అత్తయ్యా అని పిలవొద్దు అని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు అనామిక.. కళ్యాణ్ తో గొడవపడుతుంది. కావ్యను తిడుతుంది. దీంతో కళ్యాణ్, అనామికను తిడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: కౌంటింగ్‌రోజు వేషాలు వేస్తే తాటతీస్తా- అల్లరిమూకలకు పల్నాడు ఎస్పీ మలికా మాస్ వార్నింగ్